Headlines

ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు ఇవే..

ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు ఇవే..


ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తినడం అనేది మన దేశంలో కోట్లాది మందికి రోజువారీ జీవనశైలిలో ఒక భాగమైపోయింది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, సిక్స్ ప్యాక్ లేదా ఫిట్‌నెస్‌పై తీవ్ర దృష్టి పెట్టేవారు, చివరికి సామాన్య ప్రజలు కూడా తమకు కావలసిన ప్రోటీన్ కోసమని క్రమం తప్పకుండా గుడ్లను తింటుంటారు. అయితే ఇక్కడే ప్రతీ ఒక్కరి మనస్సులోనూ ఒక పెద్ద గందరగోళం మొదలవుతుంది. ఉడకబెట్టిన గుడ్డు తింటే ఒంటికి మంచిదా? లేక మసాలాలు నూనె దట్టించిన ఆమ్లెట్ తింటే ప్రయోజనమా? దేని ద్వారా మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అందుతుంది? అసలు శరీర బరువును వేగంగా తగ్గించుకోవడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఛాయిస్?” అనే అనుమానాలు ప్రతీ రోజూ డైటింగ్‌లో ఉండే వేలాది మందిని వేధిస్తూనే ఉంటాయి.

ప్రోటీన్ విషయంలో ఏది బెస్ట్?

చాలామంది ఆమ్లెట్ తింటే ప్రోటీన్ పోతుందేమో లేదా ఉడకబెడితేనే ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు. కానీ సైన్స్ ప్రకారం ఒక పెద్ద గుడ్డులో దాని పరిమాణాన్ని బట్టి సుమారు 6 నుంచి 6.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు గుడ్డును ఉడకబెట్టి తిన్నా లేదా పొయ్యిపై ఆమ్లెట్‌గా వేసి తిన్నా.. లభించే ప్రోటీన్ పరిమాణంలో ఎలాంటి పెద్ద మార్పు ఉండదు. కాబట్టి ప్రోటీన్ శాతం విషయంలో రెండూ దాదాపు సమానమైన ప్రయోజనాన్నే ఇస్తాయి.

క్యాలరీలు – కొవ్వు తేడాలు

ప్రోటీన్ ఒకేలా ఉన్నప్పటికీ, ఇవి మన శరీరానికి ఇచ్చే క్యాలరీలు మరియు కొవ్వు పరిమాణంలో మాత్రం చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. ఉడకబెట్టే ప్రక్రియలో ఎలాంటి నూనె, వెన్న లేదా నెయ్యి ఉపయోగించం. ఒక పెద్ద ఉడకబెట్టిన గుడ్డు ద్వారా శరీరానికి కేవలం 70 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. ఎలాంటి అదనపు కొవ్వులు శరీరంలోకి చేరవు కాబట్టి క్యాలరీ కంట్రోల్‌లో ఉన్నవారికి ఇది పూర్తి సురక్షితం.

ఆమ్లెట్

ఆమ్లెట్ తయారీకి వాడే ఒక స్పూన్ నూనె లేదా వెన్న వల్ల అదనంగా 40 నుంచి 50 క్యాలరీలు తోడవుతాయి. కొందరు రుచి కోసం చీజ్, ప్రాసెస్ చేసిన సాసేజ్ వంటివి ఉపయోగిస్తారు. వీటివల్ల క్యాలరీలు, చెడు కొవ్వులు ఒక్కసారిగా కొండెక్కి కూర్చుంటాయి. ఒక ప్లెయిన్ ఆమ్లెట్‌లో తయారీని బట్టి 90 నుంచి 150కు పైగా క్యాలరీలు ఉంటాయి.

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

బోయిల్డ్ ఎగ్: తక్కువ క్యాలరీలతోనే ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను ఇస్తుంది. ఎలాంటి హిడెన్ ఫ్యాట్స్ ఉండవు కాబట్టి కఠినమైన డైటింగ్ చేసేవారికి, జిమ్‌కెళ్లేవారికి ఉడకబెట్టిన గుడ్లే ఫస్ట్ ఆప్షన్.

వెజిటబుల్ ఆమ్లెట్: ఆమ్లెట్‌ను తక్కువ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో వండి.. అందులో పాలకూర, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వంటివి ఎక్కువగా వేసుకుంటే.. శరీరానికి పీచు పదార్థం, విటమిన్లు అందుతాయి. ఇది ఆకలి కోరికలను తగ్గించి బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది.

ఏది ఎంచుకోవాలి?

స్ట్రిక్ట్ క్యాలరీ కౌంట్ – లోఫ్యాట్ డైట్ ఉన్నవారు: ఎలాంటి సంకోచం లేకుండా ఉడకబెట్టిన గుడ్డును ఎంచుకోవడమే మంచిది.

రుచితో పాటు పోషకాలు కావాలనుకునేవారు: కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యితో ఎక్కువ కూరగాయలు జోడించి వెజిటబుల్ ఆమ్లెట్ చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *