Headlines

ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..?

ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..?


కర్నాటకలోని బెళగావికి చెందిన రవి హొంగల్ అనే ఫోటోగ్రాఫర్ తన 30 ఏళ్ల ఫోటోగ్రఫీ అభిరుచిని ఎవరూ ఊహించని రీతిలో చాటుకున్నారు. దాదాపు రూ.71 లక్షల వ్యయంతో కెమెరా ఆకారంలో మూడు అంతస్తుల ఇల్లు నిర్మించి దానికి క్లిక్ అని పేరు పెట్టారు. అంతేకాకుండా తన ముగ్గురు కుమారులకు సైతం ప్రముఖ కెమెరా బ్రాండ్ల పేర్లు పెట్టారు. రీసెంట్‌గా డిజిటల్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ ఈ ఇంటి హోమ్ టూర్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో, ఈ కెమెరా ఇల్లు సోషల్ మీడియాలో మరోసారి విపరీతంగా వైరల్ అయింది.

కెమెరా బ్రాండ్ల పేర్లే పిల్లల పేర్లు!

రవి హొంగల్‌కు చిన్నతనం నుంచే ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితం గడుపుతున్న ఆయన, తన ముగ్గురు కొడుకులకు ప్రముఖ కెమెరా బ్రాండ్ల పేర్లను నామకరణం చేశారు. పెద్ద కుమారుడికి కానన్, రెండో కుమారుడికి నికాన్‌, మూడో కుమారుడికి ఎప్సన్ అని పేర్లు పెట్టారు.

ఇవి కూడా చదవండి



రూ. 71 లక్షలతో కలల సౌధం క్లిక్!

పిల్లలకు బ్రాండ్‌ల పేర్లు పెట్టడమే కాకుండా, తన నివాసాన్ని ఒక పెద్ద డిఎస్ఎల్ఆర్ (DSLR) కెమెరా మోడల్‌లా నిర్మించుకోవాలని రవి భావించారు. దీని కోసం దాదాపు రూ. 71 లక్షలు వెచ్చించి, రెండున్నర ఏళ్ల పాటు శ్రమించి మూడు అంతస్తుల డిఎస్ఎల్ఆర్ కెమెరా ఆకారంలో ఇల్లు కట్టించారు. ఈ ఇంటికి క్లిక్ (Click) అని పేరు పెట్టారు. ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు మొదట్లో ఈ డిజైన్ సాధ్యం కాదని చెప్పినా, రవి తన బావమరిది సహాయంతో ఈ డిజైన్‌ను నిజం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇంటి ప్రత్యేకతలు:

ఎక్స్‌టీరియర్ డిజైన్: బయట నుంచి చూస్తే ఈ భవనం ఒక వింటేజ్ కెమెరాలా కనిపిస్తుంది. గోడలపై కానన్, నికాన్ పేర్లను ముద్రించారు.

లెన్స్, కిటికీలు: కిచెన్ విండోను కెమెరా లెన్స్ ఆకారంలో గుండ్రంగా డిజైన్ చేశారు. పిల్లల బెడ్‌రూమ్ కిటికీ ఫ్లాష్ రూపంలో ఉంటుంది.

ఇంటీరియర్స్: బాల్కనీ గ్రిల్స్ పాతకాలపు ఫిల్మ్ రోల్స్ లాగా, మెమరీ కార్డ్, వ్యూఫైండర్ వంటి భాగాలు కూడా ఇంటి డిజైన్‌లో భాగంగా ఉంటాయి. లోపలి గోడలపై ఫోటోగ్రఫీకి సంబంధించిన స్ఫూర్తిదాయక వాక్యాలు ఉంటాయి. మూడు అంతస్తులను తన ముగ్గురు కొడుకులకు కేటాయించిన రవి, తన కలల సౌధాన్ని నిజం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *