Headlines

OTT Movie: బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

OTT Movie: బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్


ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 24) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. నాగబంధం వంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పళ్లి చట్టంబి వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అంతుకు ముందు థియేటర్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెడుతూనే నవ్వించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాచీన కళింగ సామ్రాజ్యానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, అవశేషాలు ఉన్న ఒక కాలేజ్ క్యాంపస్ నేపథ్యంలో ఈ సినిమాథ మొదలవుతుంది. ఆ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న దట్టమైన అడవిలో ఒక పురాతనమైన బావి ఉంటుంది. అందులో నుంచి ఒక శక్తివంతమైన ఆత్మ బయటకు రావడంతో ఆ కాలేజ్ క్యాంపస్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి ఆ ఆత్మ ఎవరు? ఆ బావి రహస్యం ఏమిటి? చివరకు అది ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి



ఇటీవల దళపతి విజయ్‌పై సెటైర్లు చేస్తూ వైరల్ అయిన ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ సినిమా పేరు ‘సీక్రెట్ ఆఫ్ కలింగ’ (Secret of Kalinga). నూతన దర్శకుడు సనీష్ ఉణ్ణిషకృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాళవిక మీనన్, ఉల్లాస్ పందళం, మెరీనా మైఖేల్, అన్వర్ షరీఫ్, అదీర్షా, గౌరి నంద, లక్ష్మి నందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, కామెడీ, ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.

సన్ నెక్ట్స్ ఓటీటీలో సీక్రెట్ ఆఫ్ కళింగ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *