తెలుగు తెర మీద ప్రేమకథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్‌లో చర్చించుకునే ముచ్చట్లే కాదు, రీల్ లైఫ్‌లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్‌గా మారిపోయింది. మరి ప్రేక్షకులను మెప్పించేలా మన సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అసలు ఈ తరహా ట్రెండ్ సెట్ చేసిన, చేయబోతున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ అదే రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 40 ఏళ్లు దాటిన సూర్యను, పాతికేళ్ల అమ్మాయి మమిత బైజు ప్రేమించటం అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఏమాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేని ఈ సబ్జెక్ట్‌ను దర్శకుడు ఎమోషనల్‌గా ఎలా ప్రెజెంట్ చేశారన్న డిస్కషన్ జరుగుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో పాటు తమిళ యంగ్ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న హాయ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలోనూ నయన్, కవిన్ మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్టే మెయిన్ హైలైట్. ఓల్డర్ ఉమెన్, యంగర్ బాయ్ మధ్య ఎమోషనల్ ప్రేమకథగా వస్తున్న ఈ రామ్-కామ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఒకేరోజు ఇలా రెండు ఏజ్ డిఫరెన్స్ కథలు రిలీజ్ అవుతుండటంతో ఈ ఫైట్ ఆసక్తికరంగా మారింది. రియల్ లైఫ్ ఏజ్ గ్యాప్ గురించి చర్చ జరుగుతున్న టైమ్‌లో… ఆన్ స్క్రీన్ కూడా అదే పాయింట్‌ను హైలెట్ చేస్తుండటం ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ పాయింట్‌ను హైలైట్ చేస్తూ వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ కాన్సెప్ట్‌తోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. మెచ్యూర్డ్ ఉమెన్, యంగ్ బాయ్ మధ్య ఉన్న ఏజ్ అండ్ మైండ్ సెట్ గ్యాప్‌ని ఎంటర్టైనింగ్గా చూపించి టీమ్ సక్సెస్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్ఫెక్షన్కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం