Headlines

రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..?

రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..?


Mayank Yadav Player of the Match: 126 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. సీనియర్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోని వికెట్ బ్యాటింగ్‌కు ఎంతో కష్టతరంగా మారింది. బంతి అనూహ్యంగా ఎగిసిపడుతూ, కొద్దిగా స్వింగ్ అవుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం భయపడకుండా జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 50 పరుగులు సాధించి భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

మయాంక్ యాదవ్‌కు అవార్డు ఎందుకు దక్కింది?

అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ వైభవ్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వస్తుందని భావించారు. కానీ ప్రెజెంటేషన్ వేడుకలో మయాంక్ యాదవ్‌ను ఆ అవార్డు వరించింది. దీనికి ప్రధాన కారణం.. భారత్ విజయోత్సాహానికి అసలైన పునాది వేసింది మయాంక్ బౌలింగే కావడమే. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ పేసర్, ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను అవుట్ చేసి జింబాబ్వేను భారీ దెబ్బ కొట్టాడు.

ఇది కూడా చదవండి: Video: 6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ.. మోస్ట్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

పవర్‌ప్లేలోనే జింబాబ్వే నడ్డి విరిచిన మయాంక్..!

పవర్‌ప్లేలో వరుసగా 3 ఓవర్లు వేసిన మయాంక్ యాదవ్, కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మొత్తం తన 4 ఓవర్ల కోటాలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. అందులో ఏకంగా 14 డాట్ బాల్స్ ఉండటం అతడి కట్టుదిట్టమైన బౌలింగ్‌కు అద్దం పడుతోంది. హరారే పిచ్‌పై జింబాబ్వేను కేవలం 125 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో మయాంక్ బౌలింగ్ అత్యంత కీలకంగా మారింది. ఈ బౌలింగ్ ప్రదర్శనే ఛేదనలో వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు దోహదపడింది.

ఇది కూడా చదవండి: తొలి ఓవర్‌లోనే ఊహించని స్పీడ్.. అరంగేట్రంలోనే అదరగొట్టిన గుజరాత్ పేసర్..!

వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నప్పటికీ, మ్యాచ్ గతిని మార్చి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బ కొట్టినందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం మయాంక్ యాదవ్‌ను వరించింది. ఈ ఇద్దరు యువ నక్షత్రాల ప్రదర్శన భారత క్రికెట్ భవిష్యత్తుపై కొండంత నమ్మకాన్ని పెంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *