ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, తీవ్రమైన ఎండలో పనిచేసే కార్మికుల కోసం జపాన్‌కు చెందిన ‘ట్రస్కో నకయామా’ అనే సంస్థ ఓ వినూత్న పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్’గా పిలిచే ఈ పోర్టబుల్ కూలింగ్ బూత్‌కు ‘డో రెయిమాన్ బాక్స్’ అని నామకరణం చేశారు. తీవ్రమైన వేడిలో పనిచేసే కార్మికులు ఈ బూత్‌లోకి వెళ్లి కూర్చుంటే, కేవలం ఐదు నిమిషాల్లోనే వారి శరీరం చల్లబడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించిన ఈ బాక్స్ లోపల ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ముఖ్యంగా మెడ, తల, వీపు భాగాలపైకి 5 డిగ్రీల చల్లటి గాలిని ప్రసరింపజేసి శరీరాన్ని వేగంగా సేదతీరుస్తుంది. ఎక్కువసేపు చల్లదనానికి గురై అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు 20 నిమిషాల తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. నిర్మాణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో పనిచేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ స్పాట్ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 16 యెన్లు కాగా, రిటైల్ ధర దాదాపు 1.5 మిలియన్ యెన్లుగా నిర్ణయించారు. దీనిని అద్దెకు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. కార్మికులను వడదెబ్బ బారి నుంచి కాపాడేందుకు ఇదొక అదనపు భద్రతా చర్యగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా