Headlines

ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!


ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.

కేవలం స్మగ్లర్లపైనే కాకుండా, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న కింగ్‌పిన్స్‌, ఫైనాన్షియర్లు, నెట్‌వర్క్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎర్రచందనం దాచినా గుర్తించి స్వాధీనం చేసుకునేలా అంతర్రాష్ట్ర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత రెండేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి 506 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 1,239 మందిని అరెస్ట్ చేయగా, 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన స్మగ్లర్లుగా గుర్తించిన 12 మందిపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో కన్విక్షన్ రేటు 95 శాతానికి పెరగడం శుభపరిణామమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, అంతర్రాష్ట్ర సమన్వయం, కఠిన చట్ట అమలుతో ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *