Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తన నివాసంలో పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ను అరెస్టు చేయకుండా వైసీపీ శ్రేణులు పోలీసులను అడ్డగించారు. భారీ తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు అప్పలరాజును అరెస్టు చేయొద్దంటూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు అప్పలరాజును బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు.