Business Ideas: నేటి రోజుల్లో స్వయం ఉపాధి లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారు చాలా మంది తమ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి బిజినెస్‌లో స్లిప్పర్స్ (చెప్పులు) తయారీ వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఇందులో ఉన్నాయి. రోజూ ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే వస్తువు కావడంతో దీనికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది.
బీహార్లోనే అనేక పరిశ్రమలు వెలిశాయి. కొన్ని పరిశ్రమలకు గణనీయమైన పెట్టుబడి అవసరం కాగా, మరికొన్నింటిని కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు. జెహానాబాద్ జిల్లాలోని బాభ్నా గ్రామంలో గత నాలుగేళ్లుగా చెప్పుల పరిశ్రమలో పనిచేస్తున్న దేవకాంత్ పాండే, ఒక పరిశ్రమను ప్రారంభించడానికి అయ్యే ఖర్చు, దానిని ఎలా ప్రారంభించాలో వివరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..!
ఇవి కూడా చదవండి
చెప్పుల తయారీ యూనిట్ మంచి ఆదాయం:
పరిశ్రమలో అనేక రకాలు ఉన్నాయని దేవకాంత్ పాండే తెలిపారు. ఒక పరిశ్రమను ప్రారంభించడం మీ నైపుణ్యాలు, పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మీరు కావాలనుకుంటే, చాలా తక్కువ డబ్బుతో కూడా చెప్పుల తయారీ యూనిట్‌ను ప్రారంభించవచ్చు. అయితే, మార్కెట్లో చాలా పోటీ ఉంది. మీరు వినూత్నంగా ఆలోచించాలి.. ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ పెట్టాలి. ఈ రకమైన పరిశ్రమను ప్రారంభించడానికి మీరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు నెలకు 40,000 రూపాయల వరకు సంపాదించవచ్చని చెబుతున్నాడు.
ఈ పరిశ్రమను కేవలం 3 లక్షల రూపాయలతో ప్రారంభించవచ్చు:
చెప్పుల పరిశ్రమను ప్రారంభించడానికి ఒక గది, చెప్పుల సైజులను నిర్ణయించేందుకు వివిధ యంత్రాలు, విద్యుత్ అవసరమవుతాయని ఆయన అంటున్నారు. మొత్తం ఖర్చు సుమారు 2 నుండి 3 లక్షల రూపాయల వరకు రావచ్చు. మీరు ఆర్డర్ చేసే యంత్రం ఎంత మెరుగ్గా ఉంటే, ఖర్చు అంత పెరుగుతుంది. మీకు సొంత భూమి, ఇల్లు ఉంటే, ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కేవలం ఒక సిబ్బంది, ఒక గదితో దీనిని ప్రారంభించవచ్చు. ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల యంత్రాన్ని కొనాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే, యంత్రం ఒకసారి పాడైపోతే, దానికి మరమ్మత్తు చేయించడం కష్టమవుతుంది. ఇక మార్కెట్ విషయానికొస్తే, దీనికోసం అమ్మకందారులను నియమించుకుంటారు.
చెప్పుల బిజినెస్ కోసం ప్లానింగ్:
1. మార్కెట్ రీసెర్చ్, ప్లానింగ్:
ఏ వ్యాపారానికైనా సరైన ప్లానింగ్ చాలా ముఖ్యం. మీ ఏరియాలో ఎలాంటి మోడల్స్, రకాల చెప్పులకు ఎక్కువగా డిమాండ్ ఉందో తెలుసుకోండి.
సాధారణ రబ్బర్ స్లిప్పర్లు, ఫ్యాన్సీ/డిజైనర్ స్లిప్పర్లు, లేడీస్, కిడ్స్ వేర్ డిజైన్ల నాణ్యతపై ముందే అవగాహన పెంచుకోండి.
2. అవసరమైన ముడి సరుకు:
- చెప్పుల తయారీకి ప్రధానంగా కింది ముడి సరుకులు అవసరమవుతాయి.
- రబ్బర్ లేదా EVA షీట్లు: విభిన్న మందాలు, రంగులలో ఇవి లభిస్తాయి.
- స్ట్రాప్స్: వివిధ సైజులు, రంగుల స్ట్రాప్‌లు.
- ప్యాకింగ్ మెటీరియల్: బాక్సులు లేదా కవర్లు.
3. అవసరమైన మిషనరీ చిన్న స్థాయి (Small Scale) యూనిట్‌ను ప్రారంభించడానికి కింది యంత్రాలు అవసరం.
- స్లిప్పర్ మేకింగ్ మిషన్: ఇది మ్యాన్యువల్, సెమీ-ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ రూపాల్లో లభిస్తుంది.
- డైస్ : వివిధ సైజుల్లో (చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు) సోల్ కట్ చేయడానికి.
- గైండింగ్ మిషన్: కట్ చేసిన సోల్ అంచులను సమానంగా చేయడానికి.
- స్ట్రాప్ ఫిట్టింగ్ మిషన్: సోల్‌కు ఫీతలు తొడగడానికి.
4. పెట్టుబడి, లాభాలు ప్రారంభ పెట్టుబడి:
సాధారణ మ్యాన్యువల్ మిషన్లతో రూ. 50,000 నుండి రూ. 1,00,000 పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించవచ్చు. ఆటోమేటిక్ మిషన్లకైతే మరికొంత ఎక్కువ అవుతుంది.
- స్థలం: వ్యాపారానికి పెద్ద స్థలం అవసరం లేదు. మీ ఇంట్లోని ఒక చిన్న గది లేదా షెడ్ (100 – 200 చదరపు అడుగులు) సరిపోతుంది.
- లాభాలు: ఒక జత స్లిప్పర్ తయారీకి దాదాపు రూ. 30 నుండి రూ. 50 ఖర్చు అయితే, మార్కెట్లో వాటిని రూ. 80 నుండి రూ. 150 లేదా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించవచ్చు. సగటున రోజుకు 100 జతలు తయారు చేసి విక్రయించినా నెలకు రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు లాభం పొందవచ్చు.
5. మార్కెటింగ్, విక్రయాలు:
- లోకల్ షాపులు: మీ పరిసరాల్లోని హోల్‌సేల్, రిటైల్ ఫుట్‌వేర్ షాపుల యజమానులను కలిసి మీ ప్రాడక్ట్‌ను సరసమైన ధరకు ఆఫర్ చేయండి.
- సొంత బ్రాండింగ్: మీ ప్రొడక్ట్‌కు ఒక పేరు/బ్రాండ్ లోగో ప్రింట్ చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకురండి.
- ఆన్లైన్ విక్రయాలు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సెల్లర్‌గా రిజిస్టర్ అయి ఆన్లైన్లో కూడా విక్రయించవచ్చు.
తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, నిరంతర డిమాండ్ ఉండే స్లిప్పర్ మేకింగ్ యూనిట్ అనేది కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి ఉత్తమ ఎంపిక. సరైన నాణ్యత, వినూత్న డిజైన్లు, సరైన మార్కెటింగ్ వ్యూహంతో ముందుకు వెళితే ఈ వ్యాపారంలో మంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగవచ్చు.
Indian Railways: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి