Kolhapur Stadium : మహారాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. కొల్హాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించడానికి సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం, కొల్హాపూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి క్రీడా శాఖ మంత్రి సునేత్రా పవార్ సమక్షంలో మంత్రాలయంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం కర్వీర్ తాలూకాలోని వికాస్‌వాడి వద్ద దాదాపు 31.90 ఎకరాల (12.76 హెక్టార్లు) భూమిని ప్రభుత్వం కెడిసిఎకు లీజు ప్రాతిపదికన కేటాయించింది.
అత్యాధునిక వసతులు.. 35,000 మంది కెపాసిటీ
ఈ నూతన స్టేడియాన్ని కేవలం క్రికెట్‌కే కాకుండా, అన్ని రకాల క్రీడలకు ఉపయోగపడేలా ఒక మల్టీ-స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దనున్నారు. సుమారు 35,000 మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌ను తిలకించేలా దీని కెపాసిటీ ఉండబోతోంది. బిసిసిఐ, ఐసిసి నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ స్టేడియంలో మోడర్న్ పెవిలియన్, ప్రాక్టీస్ గ్రౌండ్స్, ఇండోర్ ట్రైనింగ్ సెంటర్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, క్లబ్‌హౌస్, ఫ్లడ్‌లైట్లు, ఒక క్రికెట్ మ్యూజియం, విస్తారమైన పార్కింగ్ వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, సోలార్ పవర్ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన సదుపాయాలు ఉండనున్నాయి.
జింబాబ్వే సిరీస్‌కు యంగ్ ఇండియా సిద్ధం
ఇదిలా ఉంటే, భారత క్రికెట్ జట్టు త్వరలోనే జింబాబ్వే పర్యటనకు సిద్ధమవుతోంది. జూలై 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో, అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో ఊహించని ఓటములను చవిచూసిన టీమిండియా.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉంది. సంజూ శాంసన్‌ను ఈ పర్యటనకు పక్కనబెట్టగా, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది.
జింబాబ్వే సిరీస్ కోసం భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభుసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, అభిషేక్ శర్మ, యష్ ఠాకూర్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..