Headlines

Thalliki Vandanam: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.13వేలు.. వచ్చాయో లేదా ఇలా చెక్‌ చేసుకోండి.

Thalliki Vandanam: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.13వేలు.. వచ్చాయో లేదా ఇలా చెక్‌ చేసుకోండి.


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న రూ. 15,000 ఆర్థిక సాయాన్ని నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకం కింద రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయనుంది.

అయితే ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు అందజేస్తుండగా.. అందులో రూ.13వేలు విద్యార్థుల సంరక్షకులైన వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుండగా.. మిగతా రూ.2వేలను ఆ విద్యార్థులు చదువుతున్న పాఠశాల అకౌంట్‌లో జమచేయనుంది. అయితే ఈ సారి రెండు విడతల్లో నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా ఇప్పటికే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో నిధులు జమ చేయనుండగా.. ఇక రెండో విడత కింద ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు.ఇవాళ్టి నుంచి మూడు రోజుల లబ్ధిదారుల అకౌంట్లో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి.

తల్లికి వందనం స్టేటస్‌ ఇలా చెక్ చేసుకోండి

  • మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదా ఈజీగా అన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు.
  • మీ ఫోన్ బ్రౌజర్‌లో అధికారిక పోర్టల్ bm.sgsw.ap.gov.in ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో Status Check పై క్లిక్ చేయండి.
  • Scheme Type లో Thalliki Vandanam అని ఎంచుకోండి.
  • అక్కడ లబ్ధిదారులైన వారి ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి
  • అప్పుడు మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న నెంబర్‌ ఓటీపీ వస్తుంది, ఓటీపీతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
  • స్క్రీన్‌పై మీ Payment Status కనిపిస్తుంది, అక్కడ Success / Payment Released అని వస్తే నగదు జమ అయిందని అర్థం.
  • ఒక వేళ Pending / Inactive NPCI అని వస్తే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లేదా NPCI మ్యాపింగ్ పూర్తికాలేదని అర్థం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *