ఈ సారి నైరుతి రుపువణాలు బలహీనంగా ఉండడంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురువలేదు. దీంతో వర్షాల కోసం అటు రైతన్నలను ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు సాధారణ ప్రజలకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ గత రెండ్రోజులుగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అటు ఏపీ విపత్తు నిర్వహన స్థంస్థ, ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్ర ఆయా రాష్ట్రాలకు వర్ష సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అనుబంధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతంలో రెండు తెలుగురాష్ట్రాల్లో బుధవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో వర్షాలు
బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలుల కూడా వీస్తాయని తెలిపింది.ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగులో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రాబోయే 24 గంటల్లో మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ స్పస్టం చేసింది.
ఏపీలో వర్షాలు ఇలా
ఇక అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు సైతం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వర్ష సూచనలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల, పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,