సినిమా హిట్టయినా… వంద కోట్ల కలెక్షన్లు వచ్చినా… ఇంకా మీడియం రేంజ్ స్టార్స్‌గానే మిగిలిపోతున్నారు కొందరు యంగ్ హీరోలు. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నా టైర్-1 రేంజ్‌కి మాత్రం వెళ్లలేకపోతున్నారు. ఇంతకీ నెక్ట్స్ రాబోతున్న భారీ సినిమాలతో వాళ్లు ఆ లైన్ దాటుతారా,.. ప్రమోషన్ కొడతారా? ఈ క్రేజీ డిస్కషన్‌కు సంబంధించి ఫుల్ డిటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్ టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోల టార్గెట్ అంతా వంద కోట్లు దాటి పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదగడం పైనే ఉంది. ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉన్నారు న్యాచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, యువ సామ్రాట్ నాగచైతన్య. ఇప్పటికే వంద కోట్ల వసూళ్లతో తమ మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసిన ఈ హీరోలకు… ఇంకా బిగ్ బడ్జెట్ స్టార్స్ ఇమేజ్ రాలేదు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నారు నాని. కానీ టైర్-1 బరిలో నిలవాలంటే మరో భారీ హిట్ పడాలి. అందుకే ప్రజెంట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ది ప్యారడైజ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ యాక్షన్ డ్రామా నానికి ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అటు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గీత గోవిందంతో అప్పట్లోనే వంద కోట్లు అందుకున్న రౌడీ బాయ్… ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్‌తో ‘రణబాలి’, రవికిరణ్ కోలాతో ‘రౌడీ జనార్ధన’ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టిన రౌడీ భాయ్, ఆ సినిమాలతో టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరోవైపు నాగచైతన్య కూడా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ తండేల్తో వందకోట్ల హిట్ అందుకున్న చైతూ , వృషకర్మతో మరో భారీ సక్సెస్‌ను టార్గెట్ చేశారు. చైతూ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే… బిగ్ బడ్జెట్ స్టార్స్ సరసన ప్లేస్ దక్కడం ఖాయం. మరి ఈ హీరోలు తమ నెక్ట్స్ మూవీస్‌తో మీడియం రేంజ్ అనే ట్యాగ్‌ను చెరిపేసి, బిగ్ లీగ్‌లో అడుగుపెడతారేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రష్మిక, కియారా, రుక్మిణి మధ్య హాట్ రేస్!
టాలీవుడ్లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?
షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే
Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?
Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!