Headlines

Video: ఫొటో తెచ్చిన తంట.. మనిషిని ఎత్తపడేసిన 900 కిలోల అడవి దున్న.. వీడియో చూస్తే.!

Video: ఫొటో తెచ్చిన తంట.. మనిషిని ఎత్తపడేసిన 900 కిలోల అడవి దున్న.. వీడియో చూస్తే.!


Viral Video Bison Attack: అమెరికాలోని ప్రసిద్ధ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో ఊహించని సంఘటన చేసుకుంది. అధికారుల హెచ్చరికలను పక్కనబెట్టి, వన్యమృగానికి అతి సమీపంలోకి వెళ్లిన 65 ఏళ్ల వయోవృద్ధుడిపై 900 కిలోల బరువున్న రాకాసి బైసన్ (అడవి దున్న) దాడి చేసింది. అతడిని గాల్లోకి ఎనిమిది అడుగుల ఎత్తుకు ఎగరేసి కింద పడేసిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

మనవడితో సరదాగా తిరుగుతుండగా ఎదురైన ఊహించని విపత్తు..

ఎల్లోస్టోన్ పార్క్‌లోని బ్రిడ్జ్ బే క్యాంప్‌గ్రౌండ్ ప్రాంతంలో ఈ భయానక సంఘటన చోటుచేసుకుంది. సదరు పర్యాటకుడు తన మనవడితో కలిసి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తుండగా, రహదారి పక్కన విశ్రాంతి తీసుకుంటున్న ఒక భారీ బైసన్ కనిపించింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ వన్యమృగం, వీరు ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కొద్ది క్షణాల్లోనే ఉగ్రరూపం దాల్చింది.

ఇవి కూడా చదవండి



అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు బైసన్ వస్తోందని గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరించినప్పటికీ, ప్రమాదాన్ని గ్రహించే లోపే అది దూసుకొచ్చింది. మనవడు అదృష్టవశాత్తూ అక్కడి నుంచి తప్పించుకోగా, ఆ వృద్ధుడిని చెట్ల చుట్టూ తిప్పుతూ తీవ్రంగా గాయపరిచింది.

8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ పర్యాటకుడు.. పరిస్థితి విషమం..!

కళ్లముందే జరిగిన ఈ దాడిని చూసి తోటి పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. దాదాపు 900 కిలోల బరువున్న ఆ భారీ జంతువు తన కొమ్ములతో వృద్ధుడిని బలంగా పొడిచి, దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తుకు గాల్లోకి విసిరేసింది. కిందపడిన ఆ పర్యాటకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఈ దృశ్యాన్ని చిత్రీకరించిన మైక్ మెక్‌లియోడ్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ, “ఆ సమయంలో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. బైసన్ దాడిలో ఆ వ్యక్తికి చాలా బలమైన గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందనే సమాచారం ఉంది” అని తెలిపారు. ఘటన అనంతరం అత్యవసర వైద్య సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

సంతానోత్పత్తి కాలంలో మరింత దూకుడు.. అధికారుల హెచ్చరికలు..

ప్రస్తుతం ఎల్లోస్టోన్ పార్క్‌లో బైసన్ జంతువులకు సంతానోత్పత్తి కాలం సాగుతోంది. ఈ సమయంలో మగ బైసన్లు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎంతో ఆవేశంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

శాంతంగా కనిపిస్తున్నప్పటికీ అటవీ జంతువులు ఎప్పుడైనా ప్రమాదకరంగా మారవచ్చని పార్క్ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. పర్యాటకులు వన్యమృగాలకు కనీసం నిర్దేశిత దూరం పాటించాలని, వీలైతే వాహనాల్లో ఉండే వీక్షించాలని స్పష్టం చేస్తున్నా జనాలు వినడం లేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *