Headlines

గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?

గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?


ఈ కొత్త వైరస్… కోవిడ్-19 మహమ్మారికి కారణమైన SARS-CoV-2, గతంలో విజృంభించిన SARS-CoV-1 వైరస్‌ల కుటుంబమైన ‘సార్బెకోవైరస్’కు చెందినది. ఇది మానవ కణాల్లో ఉండే ACE2 రిసెప్టర్‌లకు అతుక్కునే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. SARS-CoV-2 కూడా ఇదే మార్గం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించింది. ఈ లక్షణం వల్లే దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే, ఇప్పటివరకు ఈ వైరస్ మానవులకు సోకినట్లు ఎక్కడా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇది కేవలం శాస్త్రీయంగా గుర్తించిన ఒక ముప్పు మాత్రమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జంతువుల నుంచి మానవులకు వైరస్‌లు వ్యాపించే ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకే ఈ పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. గబ్బిలాలు అనేక రకాల వైరస్‌లను మోసుకెళుతుంటాయి. వాటిపై నిరంతరం నిఘా పెట్టడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల ముప్పును ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత వన్యప్రాణుల్లోని వైరస్‌లపై ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షణ పెరిగింది. భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి ఇలాంటి ముందస్తు హెచ్చరికలు, అంతర్జాతీయ శాస్త్రీయ సహకారం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం గుర్తు చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్

మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్

షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?

ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *