ఎట్టకేలకు గతేడాది గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2 కోట్ల నిధులతో కుచులాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గిరిగామ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇటీవల సర్పంచి ఉత్తం, మార్కెట్ డైరె క్టర్ ధనుంజయ్ గ్రామ పెద్దలతో కలిసి ఆర్టీసీ అధికారులకు సమస్యను వివరించారు. ఆర్టీసీ అధికారులు సోమవారం జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుంచి సుంకిడి, కుచులాపూర్ ఎక్స్ రోడ్డు మీదుగా గిరిగామ్, లీమ్గూడ, అట్నాం గూడ గ్రామాలకు బస్సు సేవలను ప్రారంభించారు.