Headlines

IPL 2026 Playoffs: ఒక్క విజయం.. 3 జట్ల పాలిట మరణశాసనం.. ఆ టీంకు లక్కీఛాన్స్ ఇచ్చిన SRH

IPL 2026 Playoffs: ఒక్క విజయం.. 3 జట్ల పాలిట మరణశాసనం.. ఆ టీంకు లక్కీఛాన్స్ ఇచ్చిన SRH


IPL 2026 Playoffs Scenario: శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టైటాన్స్, 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. సాధారణంగా ఐపీఎల్‌లో 16 పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్స్ స్థానం ఖాయమని భావిస్తారు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ల లెక్కల ప్రకారం, ఈ విజయం తర్వాత గుజరాత్ క్వాలిఫికేషన్ అవకాశాలు 94.9 శాతానికి పెరిగాయి.

హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఆర్‌సీబీ..

ఈ మ్యాచ్‌కు ముందు 80 శాతంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫికేషన్ అవకాశాలు, ఘోర ఓటమి తర్వాత 65.7 శాతానికి పడిపోయాయి. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా ఒకింత ఆందోళనకరంగా మారింది. ఆ జట్టు అవకాశాలు 80.1 శాతం నుంచి 79.7 శాతానికి తగ్గాయి. పంజాబ్ కింగ్స్ మాత్రం స్వల్పంగా మెరుగుపడి 62.7 శాతానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ప్రస్తుతం 42.8 శాతంగా ఉన్నాయి.

బౌలర్ల విజృంభణ: కుప్పకూలిన సన్‌రైజర్స్..

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్, గుజరాత్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. కగిసో రబడా (3/28) తన పదునైన బంతులతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన స్పెల్‌తో ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో మధ్య వరుసను దెబ్బతీయగా, ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన 19 పరుగులే జట్టులో అత్యధికం.

సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ మెరుపులు..

అంతకుముందు బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ తడబడినప్పటికీ, సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. సుదర్శన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, సుందర్ 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి కృషితో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *