Headlines

Rakul Preet Singh: గిర్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రూల్స్ బ్రేక్ చేసిన రకుల్

Rakul Preet Singh: గిర్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రూల్స్ బ్రేక్ చేసిన రకుల్


టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. గుజరాత్‌లోని గిర్ పులుల నేషనల్ పార్క్‌లో రూల్స్‌ కు విరుద్ధంగా వాకింగ్ చేశారంటూ ఆమెపై విమర్శలొచ్చాయి. ఒక వీడియో వైరల్ కావడంతో మొదలైన ఈ వివాదంపై గిర్ అటవీ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. తన కొత్త సినిమా ‘పతి పత్ని ఔర్ వో దో’ ప్రమోషన్‌లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, సహనటులు ఆయుష్మాన్ ఖురానా, వామికా గబ్బితో కలిసి గుజరాత్‌లో పర్యటించారు. ఆమె గిర్ అటవీ ప్రాంతంలో కారు దిగి, స్వేచ్ఛగా నడుస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి వైరలైంది. అది చూసిన నెటిజన్లు, “ప్రముఖులకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయా? ఫారెస్ట్ రూల్స్ ఉల్లంఘించి పార్క్‌లో మార్నింగ్ వాక్ చేసినట్లు నడుస్తున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు. వివాదంపై గిర్ అటవీ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. “ప్రచారంలో ఉన్న ఈ వీడియో క్యాంపస్ గేటు బయట చిత్రీకరించింది. ఇది అడవిలోని నిషిద్ధ ప్రాంతానికి సంబంధించినది కాదు” అని స్పష్టం చేసింది. అధికారుల ప్రకటనతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెద్ద మోసం.. జాగ్రత్త స్టార్ హీరో హెచ్చరిక

విజయ్‌ CM అయిన వేళ..త్రిషకు రూ. 12 కోట్ల జాక్ పాట్

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *