తమిళనాడు స్టేట్‌కు విజయ్ సీఎం అయిన వేళ… త్రిషకు 12 కోట్ల ఆఫర్ వచ్చిందనే ప్రచారం ఇప్పుడు తమిళనాట జోరుగా జరుగుతోంది. అదేంటంటే… చాలా ఏళ్ల తర్వాత కమల్ – రజినీ ఓ సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలోనే హీరోయిన్గా.. భారీ రెమ్యునరేషన్‌కు త్రిషను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా ఇన్సైడ్ టాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. త్రిష క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇది నోటీస్ చేసిన నెల్సన్ టీం.. తమ సినిమాలోకి త్రిషను హీరోయిన్గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం త్రిషకు ఏకంగా 12 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్‌గా ఆఫర్ చేసినట్టుగా సమాచారం. జస్ట్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే.. మంచి అంచనాలు పెంచుకున్న కమల్ – రజినీ మూవీ.. మరో రెండు నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ లోగా త్రిష ఈ మూవీ టీంకు ఓకే చెబుతుందా? లేక అందరూ అనుకుంటున్నట్టు.. విజయ్ మీద ప్రేమతో.. సినిమాలను తగ్గిస్తుందా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే
Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్
Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??
Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!
CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??