Headlines

సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?


విక్టరీ వెంకటేష్ గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్, మరెన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడతారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంటున్నారు వెంకటేష్. రీసెంట్ గా గత సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు.. ఈఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు వెంకటేష్. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు వెంకీ. సోలో హీరోగానే కాదు ఎంతో మంది యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ మూవీస్ చేశారు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతోనే కాదు, రామ్ పోతినేని, నాగ చైతన్య, విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలతోనూ మల్టీస్టారర్ మూవీస్ చేశారు.

ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..

అయితే వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి సినిమాలు చేశారు. ఒకే హీరోయిన్ తో ఆయన నాలుగు, ఐదు సినిమాలు కూడా చేశారు. అయితే ఓ హీరోయిన్ తో వెంకటేష్ ఏకంగా ఆరు సినిమాలు చేశారు. ఆ ఆరు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

నిజానికి వెంకటేష్ సౌందర్య ఇండస్ట్రీలోనే బెస్ట్ పెయిర్.. కానీ వెంకటేష్ నటి మీనాతోనూ నటించి మంచి హిట్స్ అందుకున్నారు. సౌందర్యంతో నాలుగు సినిమాలు చేసిన వెంకీ, మీనాతో ఏకంగా ఆరు సినిమాలు చేశారు. అబ్బాయిగారు, సూర్యవంశం, చంటి , సుందరకాండ, దృశ్యం, దృశ్యం 2, వెంకీ మీనా కలిసి నటించారు. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి దృశ్యం 3 లో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

Venkatesh, Meena

Venkatesh, Meena

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *