Headlines

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!


ఏవైనా పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగడం మంచిదేనా? అంటే కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. కానీ, దీనిని తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటిపండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

అరటిపండులో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలోని జీర్ణ రసాలు పలచబడి, జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. అరటిపండు, నీరు కలిసినప్పుడు కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం (Bloating), కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అరటిపండు తిని నీళ్లను తాగితే మన జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. అరటిపండు తిన్న తర్వాత నీళ్లను తాగడం వల్ల టాక్సిక్ ఎఫెక్ట్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలో శ్లేష్మం (Mucus) పెరుగుతుంది. ఇది గొంతులో ఇన్‌ఫెక్షన్, దగ్గు, జలుబు వంటి శ్వాసకోస సమస్యలకు దారితీస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగకపోతే, పండులోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించలేదు. తద్వారా మీరు పండు తిన్నా దాని పూర్తి ప్రయోజనం శరీరానికి అందదు.

ఇవి కూడా చదవండి

సరైన సమయం ఏది?: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏదైనా పండు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీరు తాగకూడదు. ఈ విరామం వల్ల శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకునే అవకాశం ఉంటుంది. అరటిపండు తిన్న తర్వాత కొంచెం సమయం వేచి ఉండి, ఆపై సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *