Headlines

PM Modi – Pawan Kalyan : అంతా ఒకే ఫ్రేమ్‌లో.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ప్రధాని మోదీ.. స్పెషల్ అట్రాక్షన్ గా మార్క్ శంకర్..

PM Modi – Pawan Kalyan : అంతా ఒకే ఫ్రేమ్‌లో.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ప్రధాని మోదీ.. స్పెషల్ అట్రాక్షన్ గా మార్క్ శంకర్..


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ , ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ జూబ్లీహిల్స్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ ను కలుసుకున్న ప్రధాని మోదీ, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. తన కోసం స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు పవన్ . ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

తన సతీమణి అన్నా కొణిదాల, పిల్లలు అకీరానందన్, ఆద్య, పోలినా అంజని, మార్క్ శంకర్‌లతో కలిసి ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సైతం ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో పవన్ తన సతీమణి అన్నా కొణిదెల, పిల్లల అకీరానందన్, ఆద్య, పోలినా అంజని, మార్క్ శంకర్‌ అలాగే ప్రధాని మోదీ ఉన్నారు. ఇప్పుడు పవన్ ఫుల్ ఫ్యామిలీ పిక్ చూసి సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా పవన్ పిల్లలు అంతా కలిసి ఒకేచోట కనిపించడం హైలెట్ అని చెప్పొచ్చు. ముఖ్యగం మార్క్ శంకర్ పవనోవిచ్ భుజాలపై చెయ్యి వేసి నవ్వూతూ కనిపించారు ప్రదాని మోదీ.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

తన శస్త్ర చికిత్స అనంతరం ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని పవన్ వెల్లడించారు. ఆ సమయంలో తనకు మోదీ ఎంతో ధైర్యం చెప్పారని అన్నారు. ఇప్పుడు తాను కోలుకుంటున్న సమయంలో స్వయంగా తన నివాసానికి రావడం ప్రధాని చూపిన అపారమైన శ్రద్ధకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.

నరేంద్రమోదీ ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

పవన్ కళ్యాణ్ ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *