Headlines

Mangoes: వీరికి మామిడి పండ్లు విషంతో సమానం.. పొరబాటున ముట్టుకున్నారో మటాషంతే!

Mangoes: వీరికి మామిడి పండ్లు విషంతో సమానం.. పొరబాటున ముట్టుకున్నారో మటాషంతే!


మామిడి పండ్లు సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసేవే. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే కొంత మందికి మామిడి పండ్లు తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి అలెర్జీ సిండ్రోమ్, మధుమేహం, జీర్ణ సమస్యలు వంటి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను వైద్యాల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే..

నోటి అలెర్జీ సిండ్రోమ్

కొంతమందికి పుప్పొడి అలెర్జీ ఉంటుంది. అంటే మామిడి పండ్లు తిన్న తర్వాత వారి నోరు దురదగా అనిపించడం, బొబ్బలు, గొంతు నొప్పి, పెదవుల సమస్యలు వస్తాయి. పుప్పొడి అలెర్జీ ఉన్నవారు మామిడి పండు తినే ముందు నిపుణుడిని సంప్రదించాలి. ఒకవేళ పొరపాటున తింటే చర్మం దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమస్య ఉన్నవారు మామిడి పండ్లకు, మామిడి చెట్లకు దూరంగా ఉండాలి.

మధుమేహం

మామిడి పండ్లలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, వారు మామిడి పండ్లను తక్కువ పరిమాణంలో, సరైన సమయంలో తినడం ఉత్తమం. ఒకవేళ మీకు మామిడి పండ్లను ఎక్కువగా తినాలనిపిస్తే తప్పకుండా వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఏమి తిన్నా వారికి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. వారు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడతారు. తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. వారు కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలతో కూడా బాధపడతారు. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటం మంచిది.

మెడిసిన్‌తో ప్రతిచర్యలు

మామిడి పండ్లలో ఫ్యూరనోకౌమరిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇది కాలేయ సమస్యలు ఉన్నవారికి లేదా ఇతర అనారోగ్య సమస్యలకు మందులు తీసుకుంటున్న వారికి ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, మామిడి పండ్లు తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఎక్కువగా మామిడిపండ్లు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలగవచ్చు. గ్యాస్ కలిగించే ఆహార పదార్థాలతో పాటు మామిడిపండ్లు తినడం వల్ల తీవ్రమైన కడుపు సమస్యలు వస్తాయి. కాబట్టి, ఒకేసారి ఎక్కువగా మామిడిపండ్లు తినవద్దు. కానీ మీరు వాటి రసం తీసి తాగవచ్చు. చక్కెర లేకుండా కేవలం రసం తాగడం మంచిది కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మామిడిపండ్లు తినాలా వద్దా అనే దాని గురించి వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. మేము వాటిని ఆమోదించడం లేదు. దయచేసి వాటిని అనుసరించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *