Headlines

Raghu Babu : 25 ఏళ్ల కష్టం ఒక్క సినిమాతో పోయింది.. ఆస్తులు పోగొట్టుకొని తినడానికి తిండి లేక ఉన్నప్పుడు ఆయనే ఆదుకున్నాడు.. నటుడు రఘు బాబు..

Raghu Babu : 25 ఏళ్ల కష్టం ఒక్క సినిమాతో పోయింది.. ఆస్తులు పోగొట్టుకొని తినడానికి తిండి లేక ఉన్నప్పుడు ఆయనే ఆదుకున్నాడు.. నటుడు రఘు బాబు..


తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు బాబు. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు పెద్ద కుమారుడు. ఆయన సోదరుడు బోస్ బాబు కూడా సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రొడక్షన్ పనులు చూసుకునేవారు, కొన్ని డబ్బింగ్ సినిమాలను విడుదల చేశారు. కెరీర్ ప్రారంభంలో ఆది సినిమాలో గంగిరెడ్డి పాత్రతో క్రూరమైన విలన్‌గా మెప్పించారు. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. ‘కబడ్డీ కబడ్డీ’ సినిమాతో ఆయన కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంది. బన్నీ, కిక్, బృందావనం, యమదొంగ, లౌక్యం వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా 400కు పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల తన సినీ ప్రయాణం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూ, తనను నటుడిగా గుర్తించి ప్రోత్సహించిన దర్శకుడు సత్యారెడ్డి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రఘు బాబు తనను నటుడిని చేసిన “ఆది గురువు” సత్యారెడ్డి అని పేర్కొన్నారు. వాస్తవానికి రఘు బాబుకి నటుడు అవ్వాలనే ఆలోచన గానీ, ఆసక్తి గానీ అప్పట్లో లేవు. ఆయన ఎక్కువగా తెర వెనుక పనులు, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడానికే ఇష్టపడేవారు. కానీ సత్యారెడ్డి ఆయనలో ఉన్న నటనా నైపుణ్యాన్ని గుర్తించి, నటుడిగా మారాలని పట్టుబట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

సత్యారెడ్డి ‘సామ్రాజ్యం’ అనే సినిమా తీస్తున్న సమయంలో రఘు బాబుని ఒక ముఖ్య పాత్ర చేయమని కోరారు. అయితే రఘు బాబు తనకు ఆసక్తి లేదని ఖరాఖండిగా చెప్పారు. కానీ ఒకరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి, పేపర్లో వచ్చిన సినిమా ప్రకటనలో తన ఫోటో ఉండటం చూసి రఘు బాబు షాక్ అయ్యారు. తనను అడగకుండానే ఫోటో వేశారని ఆయన ప్రశ్నిస్తే.. “నీలో మంచి నటుడు ఉన్నాడు, నా కోసం ఈ సినిమా చేయాలి” అని సత్యారెడ్డి ఎంతో ప్రేమతో కోరారని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

షూటింగ్ సమయంలో కూడా రఘు బాబు కేవలం ప్రొడక్షన్ పనులు చూసుకుంటానని, నటన చేయనని మొండికేసినా.. సత్యారెడ్డి మాత్రం వదలకుండా ఆయనతో మేకప్ వేయించి ఒక్కో సీన్ చేయించుకున్నారు. మొదటి సినిమా విడుదలయ్యాక థియేటర్లో జనాలు రఘు బాబు నటనకు నవ్వుతూ ఎంజాయ్ చేయడం చూసి, ఆయన తండ్రి గిరిబాబుతో పాటు మురళీ మోహన్, గుమ్మడి వంటి పెద్దలు కూడా రఘు బాబుని అభినందించారు. తిండికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో సత్యారెడ్డి తనను వెతికి పట్టుకొని, ఒక దారి చూపించారని రఘు బాబు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *