Headlines

Sanjana Galrani: నన్ను బలిపశువును చేశారు.. చేయని తప్పుకు నిందలు భరించా.. సంజన ఎమోషనల్..

Sanjana Galrani: నన్ను బలిపశువును చేశారు.. చేయని తప్పుకు నిందలు భరించా.. సంజన ఎమోషనల్..


సంజన గల్రానీ.. పరిచయం అవసరంలేని పేరు. కథానాయికగా తెలుగు తెరపై సందడి చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు మూవీతో తెలుగులో పాపులర్ అయ్యింది. అయినప్పటికీ ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అనుహ్యంగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలు జీవితం అనుభవించింది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితం, సినీ ప్రయాణం, సవాళ్ల గురించి పంచుకున్నారు. అలాగే తన తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన డ్రగ్స్ కేసు వివాదం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. డ్రగ్స్ కేసు తన జీవితాన్ని తలకిందులు చేసిందని సంజన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతో నమ్మిన స్నేహితులే తనను ఈ కేసులో ఇరికించి, వెన్నుపోటు పొడిచారని ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా తాను ఉన్నత స్థాయిలో ఉండటం చూసి ఓర్వలేక కొందరు చేసిన కుట్రకు తాను బలిపశువును అయ్యానని, చేయని తప్పుకు నిందలు భరించాల్సి వచ్చిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఆ కష్టకాలంలో తాను అనుభవించిన నరకం గురించి చెబుతూ, “నేను ఎంత ఏడ్చానో కేవలం నా దిండుకు మాత్రమే తెలుసు” అని ఎమోషనల్ అయ్యారు. నిద్రలేని రాత్రులు గడిపానని, తన కన్నీళ్లతో దిండు తడిసిపోయేదని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని, కానీ తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఆ ఆలోచనను మానుకున్నానని సంజన వివరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనడానికి ప్రధాన కారణం తనపై పడిన డ్రగ్స్ ముద్రను చెరిపేసుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఐదు నెలల వయసున్న పాపను వదిలి రావడంపై విమర్శలు వచ్చినా, తన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హౌస్‌లో మూడు నెలల పాటు ఉన్న సమయంలో తన ప్రవర్తన ద్వారా తనకు ఎలాంటి అలవాట్లు లేవో నిరూపించుకున్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గర్భం దాల్చడం తన జీవితంలో పెద్ద మలుపు అని, ఆ సంతోషంలో పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోగలిగానని సంజన తెలిపారు. 2020లో మొదలైన ఈ వివాదంలో 2024లో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పుడు పూర్తి ప్రశాంతంగా ఉన్నానని, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నానని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *