Headlines

Best Free AI Tools: కొంప ముంచుతున్న AI టూల్స్‌.. ఈ సెట్టింగ్స్‌ మార్చకుంటే మీ డేటా గుళ్లో ప్రసాదమే..!

Best Free AI Tools: కొంప ముంచుతున్న AI టూల్స్‌.. ఈ సెట్టింగ్స్‌ మార్చకుంటే మీ డేటా గుళ్లో ప్రసాదమే..!


AI టూల్స్‌ వాడేవారిలో చాలా మందికి తెలియని విషయం ఇది. ముఖ్యంగా విద్యార్ధులకు దీనిపై కనీస అవగాహన ఉండాలి. అత్యంత పాపులర్ అయిన చాట్‌బాట్‌లు డిఫాల్ట్‌గా ప్రాంప్ట్‌లను సేకరిస్తాయి. కొన్ని వాటిని 30 రోజుల పాటు ఉంచుతాయి. మరికొన్ని.. ఏకంగా సంవత్సరాల పాటు అలాగే ఉంచుతాయి. ఇక 2025లో ఎప్పటినుంచో గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ భిన్నంగా వ్యవహరిస్తున్న ఆంత్రోపిక్.. తన విధానాన్ని మార్చుకుని మీరు వద్దని చెప్పేంత వరకు ఇప్పుడు క్లాడ్‌కు వినియోగదారుల చాట్‌లపైనే శిక్షణ ఇస్తుంది.

ఒక విద్యార్థిగా మీరు మీ నోట్స్, డ్రాఫ్ట్ థీసిస్, లేదా అప్లికేషన్‌ ఫారం నింపడానికి షార్ట్‌కట్ కోసం మీ ఐడి వివరాలను ChatGPTలో నమోదు చేస్తున్నట్లయితే గోప్యతకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవల్సి ఉంటుంది. 2026లో మీ డేటాను కేవలం శిక్షణ ఇంధనంలా చూడని పటిష్టమైన ఉచిత అప్లన్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోని AI టూల్స్‌ ఎంతో నిజాయితీగా మీ చాట్‌ డేటాను గోప్యంగా ఉంచుతాయి. ఇవి ఎలా పని చేస్తాయి? వేటికి పరిమితులు ఉన్నాయి? వేటిని వదిలేయడం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

AIని ఉపయోగించే విద్యార్థులకు గోప్యత ఎందుకు అవసరం?

ఇతరుల కంటే విద్యార్థులు AIతో మరింత సున్నితమైన విషయాలను పంచుకుంటారు. వ్యక్తిగత వివరాలు కలిగిన లెక్చర్ నోట్స్, వ్యక్తిగత స్టేట్‌మెంట్స్, పరీక్షలకు ముందు ఆరోగ్య ప్రశ్నలు, NDA పరిధిలోని ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్‌ల కోడ్‌లు, వీసా దరఖాస్తుల కోసం ఫ్యామిలీ విషయాలు, వారి జీవితానికి సంబంధించిన ప్రశ్నలు తరచూ చాట్‌బాట్‌లను అడుగుతుంటారు. చాలావరకు ఏఐ టూల్స్‌ ఆ ప్రాంప్ట్‌లన్నీ లాగ్ చేస్తాయి. మీరు మీ మొబైల్‌ లేదా కంప్యూటర్‌లో సెట్టింగ్‌ను మార్చకపోతే ChatGPT Free వాటిని డిఫాల్ట్‌గా సేవ్ చేసుకుని, మోడల్‌లను మెరుగుపరచడానికి వాటిని తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది. మీరు చాట్ ఆపివేసిన తర్వాత కూడా Google Gemini 72 గంటల వరకు మీ చాట్‌ను సేవ్ చేస్తుంది. Microsoft Copilot కన్స్యూమర్ ఏకంగా 18 నెలల పాటు చాట్‌లను సేవ్‌ మోడ్‌లో ఉంచుతుంది. అందుకే మీ డేటాను నిల్వ చేయని, దానిపై శిక్షణ ఇవ్వని సాధనాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

విద్యార్థుల కోసం AI సాధనాలు – గోప్యతను దృష్టిలో ఉంచుకొని
ఇందుకు AIని తప్పించుకోవడం పరిష్కారం కాదు. సరైన పనుల కోసం సరైన సెట్టింగ్‌లతో సరైన సాధనాలను ఉపయోగించడమే అసలైన పరిష్కారం. విద్యార్ధులకు అత్యంత సురక్షితమైన ప్రైవేట్ చాట్‌బాట్ కావాలంటే DuckDuckGo Duck.aiని ఉపయోగించవచ్చు. ఎలాంటి సెటప్, అకౌంట్ అవసరం లేని టూల్ ఇది. ఏదైనా బ్రౌజర్‌లో duck.ai ని ఓపెన్ చేసి, టైప్ చేయడం మొదలుపెట్టవచ్చు. ఇది మీ IP చిరునామా, గుర్తింపు మెటాడేటాను తొలగిస్తుంది. ఇది 30 రోజులకు మించి సంభాషణపై శిక్షణ ఇవ్వడాన్ని లేదా దానిని నిల్వ చేయదు. చాట్ హిస్టరీ మీ బ్రౌజర్ లోకల్ స్టోరేజ్‌లో మాత్రమే ఉంటుంది. అలాగే Brave Leo, Proton Lumo, Mistral Le Chat, NotebookLM, Local AI వంటి AI టూల్స్‌ మీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుంది.

మీ డేటా గోప్యంగా ఉండాలంటే ఈ కింది సెట్టింగ్స్‌ మార్చండి

తాత్కాలిక చాట్ ఐకాన్‌ను (కుడి ఎగువన, చుక్కల స్పీచ్ బబుల్ లాగా కనిపిస్తుంది) క్లిక్ చేయండి, అప్పుడు ఆ సంభాషణ హిస్టరీలో కనిపించదు, శిక్షణ కోసం ఉపయోగించబడదు మరియు 30 రోజులలోపు తొలగించబడుతుంది. అలాగే డేటా కంట్రోల్స్‌లో ‘Improve the model for everyone’ అనేదాన్ని ఆఫ్ చేయాలి. ఇది మీరూ ఆఫ్‌ చేయకపోతే ఆంత్రోపిక్ యూజర్ చాట్‌లపై శిక్షణ ఇస్తుంది. Privacyలోకి వెళ్లి Help improve Claude ఆప్షన్‌లో no training, no historyని క్లిక్‌ చేస్తే మీ డేటా సేవ్‌ అవ్వదు. విద్యార్ధులు AI టూల్స్‌ వాడేముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంకు వివరాలు, వైద్య రికార్డులు, మరెవరి వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో పంచుకోకూడదు. ఎలాంటి శిక్షణ ఇవ్వమని చెప్పే టూల్స్‌ కూడా ఈ విషయాల్లో ఉల్లంఘనలకు వెనకాడవు. పేర్లు, ఫోన్ నంబర్లు, ఖచ్చితమైన చిరునామాలు, ఉద్యోగి ఐడీలు.. వాటి స్థానంలో ఫేక్‌ వివరాలు నమోదు చేయండి. AIకి తేడా తెలియదు కాబట్టి సమాధానాలు సాధారణంగానే ఇస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *