Headlines

కోట్లు కుమ్మరించినా కొంపముంచారుగా సామీ.. ఐపీఎల్ 2026లో అట్టర్ ఫ్లాప్ అయిన నలుగురు..!

కోట్లు కుమ్మరించినా కొంపముంచారుగా సామీ.. ఐపీఎల్ 2026లో అట్టర్ ఫ్లాప్ అయిన నలుగురు..!


కోట్లు కుమ్మరించినా కొంపముంచారుగా సామీ.. ఐపీఎల్ 2026లో అట్టర్ ఫ్లాప్ అయిన నలుగురు..!

Expensive Flop Players: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకుంది. వేలంలో ఇతర జట్లతో పోటీ పడి మరీ అతడిని కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీకి నిరాశే ఎదురైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచ్‌లే ఆడిన లివింగ్‌స్టోన్, బ్యాట్‌తో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ ఒక్క ఓవర్ కూడా వేయకపోవడం గమనార్హం. అతనిపై పెట్టిన భారీ పెట్టుబడి ప్రస్తుతం వృథా అయినట్లే కనిపిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: నిరాశపరిచిన జాకబ్ బెథెల్..

ఆర్సీబీ జట్టు గాయపడిన ఫిల్ సాల్ట్ స్థానంలో ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్‌ను జట్టులోకి తీసుకుంది. గతంలో మంచి ప్రదర్శన చేసినందుకుగాను అతడిని 2.60 కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది. అయితే ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన బెథెల్ కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 10.75గా ఉంది. అత్యధిక స్కోరు 20 పరుగులు మాత్రమే కావడం అతని పేలవ ఫామ్‌కు నిదర్శనం.

రాజస్థాన్ రాయల్స్: షిమ్రాన్ హెట్మెయర్ పేలవ ఆటతీరు..

మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాడిని వదులుకొని మరి షిమ్రాన్ హెట్మెయర్‌ను 11 కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది. కానీ హెట్మెయర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో జట్టుపై చేసిన 22 పరుగులే ఈ సీజన్‌లో అతడి అత్యుత్తమ స్కోరు. ఫినిషర్‌గా గుర్తింపు పొందిన హెట్మెయర్ ఇలా వరుసగా విఫలం కావడం పింక్ ఆర్మీని కలవరపెడుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ మిల్లర్ ‘కిల్లర్’ ప్రదర్శన ఎక్కడ?

దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల రూపాయల కనీస ధరకు కొనుగోలు చేసింది. మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు తీస్తాడని భావించినప్పటికీ, అతను ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఏడు మ్యాచ్‌ల్లో కలిపి 123 పరుగులు చేసినా, జట్టుకు అవసరమైన సమయంలో వేగంగా ఆడటంలో విఫలమయ్యాడు. గుజరాత్‌పై చేసిన 41 పరుగులు మినహా, మిగిలిన మ్యాచ్‌ల్లో మిల్లర్ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *