Headlines

TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం.. సందడి చేసిన త్రిష

TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం.. సందడి చేసిన త్రిష


కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం టీవీకే పార్టీ నాయకుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.., తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు, మే 10, 2026న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినిమా సెలబ్రిటీలు, దళపతి విజయ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి నటి త్రిష కూడా హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో సందడి చేశారు త్రిష.

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

త్రిష తన ఇంటి నుండి బయలుదేరుతున్న వీడియో, అలాగే కార్యక్రమంలో సందడి చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష చీర కట్టుకుని అందంగా ముస్తాబై వచ్చారు. ఈ కార్యక్రమానికి తన తల్లితో కలిసి హాజరైన నటి త్రిష వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. త్రిషతోపాటు ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

నటి త్రిష, విజయ్ అనేక చిత్రాలలో కలిసి నటించారు. చివరిసారిగా 2023లో విడుదలైన ‘లియో’ చిత్రంలో కలిసి నటించారు ఈ ఇద్దరూ.. 2024లో వచ్చిన ‘ది గోట్’ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటలో త్రిష నృత్యం చేయడం గమనార్హం. దీని తర్వాత, తాను పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని విజయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో, ‘జన నాయగన్’ తన చివరి చిత్రం అవుతుందని ఆయన ప్రకటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *