Headlines

పవన్‌ను నేను ఎప్పుడూ తిట్టలేదు.. జస్ట్‌ నిజాలు చెప్పా- Tv9 క్రాస్‌ఫైర్‌లో రోజా కీలక వ్యాఖ్యలు!

పవన్‌ను నేను ఎప్పుడూ తిట్టలేదు.. జస్ట్‌ నిజాలు చెప్పా- Tv9 క్రాస్‌ఫైర్‌లో రోజా కీలక వ్యాఖ్యలు!


రాజకీయ ప్రత్యర్థులను తిడ్డడం అనే అంశంపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పవన్‌ను ఎప్పుడూ తిట్టలేదు.. నిజాలు మాత్రమే చెప్పామన్నారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇతర నాయకులను తిట్టాల్సిన అవసరం లేదని, జగన్ నిజంగా గొప్ప నాయకుడని, మానవతావాది అని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తమ నాయకులను ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేయమని ఆదేశించలేదని, వైసీపీలో నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమి నాయకులు మాత్రం వ్యక్తిగత దూషణలకు, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడేది వైఎస్సార్‌సీపీ మాత్రమేనని, ప్రత్యర్థులను తిట్టడం కాదని పునరుద్ఘాటించారు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని, వైఎస్సార్‌సీపీ కేవలం ప్రజల సమస్యలపై పోరాడుతుందని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *