Headlines

CUET UG 2026 Dress Code: సీయూఈటీ యూజీ 2026 ఎగ్జాంకు డ్రెస్‌ కోడ్.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ

CUET UG 2026 Dress Code: సీయూఈటీ యూజీ 2026 ఎగ్జాంకు డ్రెస్‌ కోడ్.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ


హైదరాబాద్‌, మే 8: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) 2026 అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. సీయూఈటీ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలు నమోదు చేసిన అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షలు మే 11 నుంచి 31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది.

సీయూఈటీ యూజీ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పరీక్షలు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాల్లోని వివిధ కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి షిఫ్ట్ గరిష్ఠంగా 3 గంటల పాటు ఉంటుంది. అభ్యర్థికి కేటాయించిన సబ్జెక్టుల సంఖ్యను బట్టి కనీసం 1 గంట, గరిష్ఠంగా 3 గంటల వరకు పరీక్షా కేంద్రంల్లోనే తప్పనిసరిగా ఉండవల్సి ఉంటుంది. అంటే ఒక సబ్జెక్టు ఉన్నవారు 1 గంటలో, రెండు సబ్జెక్టులు ఉన్నవారు 2 గంటల తర్వాత పరీక్ష ముగించి బయటకు రావచ్చు. గేటు మూసివేసే సమయానికి కనీసం ఒక గంట ముందుగానే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు ఎన్‌టీఏ సూచించింది. అలాగే పరీక్ష రోజున అభ్యర్థులు సాదాసీదా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సూచించింది. తెలుపు రంగు, లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. విద్యార్థులు సాధారణ బూట్లు, చెప్పులు, లో-హీల్స్ ధరించవచ్చు. బరువైన ఆభరణాలు, ఫ్యాషన్ వస్తువులను ధరించకూడదు.
సీయూఈటీ యూజీ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అభ్యర్థులు కాగితాలు, నోట్సులు, పుస్తకాలు, పెన్సిల్ పెట్టెలు, జామెట్రీ బాక్స్‌లు, పెన్నులు, స్కేళ్ళు, ఎరేజర్లు వంటి స్టేషనరీ వస్తువులను తీసుకురావడానికి అనుమతి లేదు. కాలిక్యులేటర్లు, కెమెరాలు, స్కానర్లు, ఎలక్ట్రానిక్ పెన్నులతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా నిషేధించబడ్డాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, పేజర్‌ల వంటి కమ్యూనికేషన్ పరికరాలను పరీక్షా హాలు లోపలికి అనుమతించరు. బ్యాగులు, బెల్టులు, పర్సులు, టోపీలు, కళ్లద్దాలు వంటి యాక్సెసరీలకు అనుమతి లేదు. ఇతర వివరాలు ఈ కింద లింక్‌లో చెక్‌ చేసుకోండి.

సీయూఈటీ యూజీ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *