తెలంగాణలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది, ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా మెండోరాలో ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఎండల తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత రోడ్లపై జనం కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు వస్తున్నారు. వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :