OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే  భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే  భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్


OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే  భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

‘మసూద’, ‘పరేషాన్’,  ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్. ఇదే కోవలో అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గా నరేష్ తెరకెక్కించిన ఈ రూరల్ కామెడీ మూవీలో తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ రాశి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన పాపం ప్రతాప్ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఎప్పటిలాగే తిరువీర్ తన సహాజ నటనతో మెప్పించాడు. అలాగే హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కూడా అందం, అభినయం పరంగా ఆకట్టుకుంది. థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న పాపం ప్రతాప్ సినిమాకు ఐఎమ్ డీబీలో ఏకంగా 7.8 రేటింగ్ ఉండడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ దగ్గర ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరువీర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన  వెలువడింది. మే 07 నుంచి పాపం ప్రతాప్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ..  “పాప్‌కార్న్ రెడీ.. ప్లే బటన్ కూడా రెడీ.. మే 7 నుంచి.. పాపం ప్రతాప్ కాదు వీర ప్రతాప్ అంటారు.. ఎ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ ప్రీమియర్స్ మే 7 నుంచి ఈటీవీ విన్ లో..” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.

క్రిషి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఈటీవీ విన్ సంయుక్తంగా పాపం ప్రతాప్ సినిమాను నిర్మించారు. గోపరాజు రమణ, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, రవి ఆంథోని, రఘు బాబు, రూపా లక్ష్మి, ప్రసాద్ బెహరా, అనంత్ బాబు తదితరులు ఈ మూవీలో కీలక పాత్ర లు పోషించారు. చాలా ఏళ్ళ తర్వాత సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం.

ఈటీవీ విన్ లో పాపం ప్రతాప్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *