ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో విక్కీ కౌశల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు పరశురాముడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహావతార్ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం 2027 సంవత్సరం మొత్తాన్ని కేటాయించడమే కాకుండా, షూటింగ్ సమయంలో మాంసాహారాన్ని కూడా తినకూడదని నిర్ణయించుకున్నారు.ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ మరియు సామ్ బహదూర్ వంటి చిత్రాలతో ఉత్తమ నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు విక్కీ కౌశల్. తెరమరుగైన హీరోల పాత్రలకు తాను ఉత్తమ ఎంపిక అని నిరూపించుకోవడంతో, మీడియా కూడా ఈ యంగ్ హీరోపై దృష్టి సారిస్తోంది. ఈ ఇమేజ్‌ను కొనసాగిస్తూ విక్కీ అనేక విభిన్న చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు. ఛావా చిత్రంతో మరోసారి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :