రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!

రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!


విజయవాడ సమీపంలోని రామవరంపాడు వద్ద, కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై ఓ చిరు వ్యాపారి తన మామిడి వ్యాపారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయన ఓ ప్రత్యేక ఆలోచనతో ముందుకు వచ్చారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న రావిచెట్టును తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడు.ఆ వ్యాపారి రావిచెట్టు కొమ్మలకు తాడుతో మామిడికాయలను వేలాడదీశాడు. దీంతో రావిచెట్టుకే మామిడికాయలు కాసినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా రావిచెట్టుకు మామిడికాయలు కాయవు. ఈ అసాధారణమైన, వింతైన దృశ్యం అటుగా వెళ్లే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆశ్చర్యపోయిన బాటసారులు ఆగి, ఈ దృశ్యాన్ని చూడటమే కాకుండా, ఆ వ్యాపారి వద్ద మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునే తెలివితేటలు ఉంటేనే వ్యాపారం విజయవంతమవుతుందని ఈ చిరు వ్యాపారి నిరూపించాడు. ఇతర వ్యాపారస్తుల కంటే భిన్నంగా ఆలోచించి తన వ్యాపారాన్ని విజయవంతం చేసుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *