చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్‌ శిఖరానికి చేరి..

చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్‌ శిఖరానికి చేరి..


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉండి కూడా చాలామంది నిష్క్రియాత్మకంగా గడిపేవారు ఉండగా, ఈ విద్యార్థులు కాళ్లు, కళ్లు, చెవులు సరిగా లేకపోయినా తమ పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. “నీవల్ల కాదు” అన్న విమర్శలనే నిచ్చెనలుగా మార్చుకొని వీరు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలోని బేస్ క్యాంప్‌ను చేరుకున్నారు. వినికిడి లోపం, దృష్టి లోపం, నడవలేని సమస్యలున్న ఈ నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం సమగ్ర శిక్షణా కార్యక్రమం ద్వారా అరుదైన అవకాశం కల్పించింది. తొలుత గండికోటలో, ఆపై లద్దాఖ్‌లోని గడ్డకట్టే చలిలో రెండు నెలల పాటు వీరికి కఠినమైన శిక్షణ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!

టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!

సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *