Team India: 2028 ఒలింపిక్స్‌లో టీమిండియా ఓపెనర్లు వీరే..! 6 ఓవర్లలోనే మ్యాచ్ అయిపోద్ది..

Team India: 2028 ఒలింపిక్స్‌లో టీమిండియా ఓపెనర్లు వీరే..! 6 ఓవర్లలోనే మ్యాచ్ అయిపోద్ది..


క్రికెట్ అంటేనే మన ఇండియన్స్ ఒక ఎమోషన్. అందులోనూ టీ20 మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీల ముందు వాలిపోతాం. రీసెంట్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, మన టీమిండియా భవిష్యత్తు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మన కుర్రాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ గురించి గిల్‌క్రిస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గిల్‌క్రిస్ట్ అంటేనే విధ్వంసకర ఓపెనింగ్‌కు మారుపేరు. అలాంటి ఆటగాడే మన యువ ఓపెనర్లను చూసి ఆశ్చర్యపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

టీ20ల్లో మొదటి ఆరు ఓవర్లు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఆ పవర్ ప్లేలో ఈ ఇద్దరు కుర్రాళ్లు క్రీజులోకి వస్తే బౌలర్లకు చుక్కలే అని గిల్లీ అభిప్రాయపడ్డారు. వారిద్దరూ 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి చెబుతూ.. “ఈ వయసులో ఇంత పవర్ ఎక్కడిది?” అని గిల్‌క్రిస్ట్ విస్మయం వ్యక్తం చేశారు. అతని చేతి మణికట్టులో ఉన్న బలం, భయం లేని ఆటతీరు చూస్తుంటే నిజంగానే ఒక అద్భుతంలా ఉందని కొనియాడారు. బీసీసీఐ ఈ కుర్రాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, తను భారత క్రికెట్ ఆస్తి అని సూచించారు. అభిషేక్ శర్మ ఇప్పటికే ఐపీఎల్‌లో తన పవరేంటో చూపించాడు, ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే టీమిండియాకు తిరుగుండదని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.

Also Read:

హార్దిక్ బ్లండర్..! బౌలింగ్ కాదు.. ముంబై ఓటమికి అసలు కారణం ఇదే..

ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *