Indian Railways: ట్రైన్ నెంబర్‌లో మొదటి అంకెకు అర్థం ఏంటి..? ఎవ్వరికీ తెలియని అసలు సీక్రెట్ ఇదే..

Indian Railways: ట్రైన్ నెంబర్‌లో మొదటి అంకెకు అర్థం ఏంటి..? ఎవ్వరికీ తెలియని అసలు సీక్రెట్ ఇదే..


భారతదేశంలో రైల్వే నెట్ వర్క్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. రైలు నెంబర్లు, బోగీలపై ఉండే నెంబర్లు, కోడ్‌లకు అనేక ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రతీ ట్రైన్‌ను గుర్తించేందుకు ఒక నెంబర్ కేటాయిస్తారు. మనం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఈ నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ 5 అంకెలు ఉంటుంది. ఇందులో మొదటి అంకెకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ట్రైన్ ఏ రాష్ట్రం, ఏ జోన్ నుంచి వస్తుందనేది సులువుగా దీని ద్వారా గుర్తించవచ్చు. ఐదు అంకెల్లో ప్రతీ నెంబర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి అంకె ఆ ట్రైన్ ఎక్కడ నుంచి వస్తుందనేది తెలుపుతుంది.

మొదటి నెంబర్ అర్థం ఏంటంటే..?

-మొదటి అంకె జీరోతో మొదలైతే అవి తత్కాలిక ప్రత్యేక రైళ్లుగా చెప్పవచ్చు. పండుగలు, వేసవి రద్దీ సమయాల్లో వీటిని నడుపుతారని చెప్పవచ్చు

-1తో మొదలైతే దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లుగా గుర్తించవచ్చు. మెయిల్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది, రాజధానిలాంటి ట్రైన్లకు ఈ నెంబర్ ఉంటుంది.

-ఇక 1తో మొదలయ్యే నెంబర్లు అయినపోయినప్పుడు సూపర్ ఫాస్ట్ రైళ్ల కోసం 2 నెంబర్ వాడతారు

-ఇక 3తో ట్రైన్ నెంబర్ ప్రారంభమైతే ముంబై, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలను కవర్ చేసే వెస్ట్రన్ రైల్వే పరిధిలోకి వస్తుందని అర్థం.

-ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గుండా వెళ్లే రైళ్లు సెంట్రల్ రైల్వే కిందకు వస్తాయి. వీటి ట్రైన్ నెంబర్లు 4తో స్టార్ట్ అవుతాయి

-ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే దక్షిణ మధ్య రైల్వే ట్రైన్లు 5 నెంబర్‌తో ప్రారంభమవుతాయి

-తమిళనాడు, కేరళ వైపు వెళ్లే ట్రైన్లు 6వ నెంబర్‌తో ప్రారంభమవుతాయి.

-పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల పరిధిలోని తూర్పు రైల్వేకు చెందిన ట్రైన్లు 7వ నెంబర్‌తో ప్రారంభమవుతాయి

-ఈశాన్య రాష్ట్రాల మీదుగా వెళ్లే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైళ్లు 9వ అంకెతో ప్రారంభమవుతాయి

-ఒడిశా, జార్ఖండ్ మీదుగా నడిచే సౌత్ ఈస్టర్న్ రైళ్లు 8తో ప్రారంభమవుతాయి.

-ఈ నెంబర్ల ట్రైన్ ఏ జోన్‌కు చెందినది, ఏ వైపు వెళుతుంది అనేది సులువుగా గుర్తించవచ్చు. దీని వల్ల అధికారులకు గుర్తించడం సులువుగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *