LIVE Vote Counting of Assembly Election Results 2026: ఎన్నికల ఫలితాల లైవ్ ఇక్కడ చూడండి..

LIVE Vote Counting of Assembly Election Results 2026: ఎన్నికల ఫలితాల లైవ్ ఇక్కడ చూడండి..


ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కించారు. ఆ తర్వాత EVM ఓట్ల కౌంటింగ్ షురూ చేశారు. ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.  కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు భద్రత పెంచారు. కౌంటింగ్‌ సిబ్బంది హాల్‌లో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం విధించారు. కౌంటింగ్‌ ప్రారంభమైన తొలి రెండుగంటల్లో ట్రెండ్స్‌ తెలిసే అవకాశం ఉంది.

తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో 823 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అందరి చూపు బెంగాల్‌, తమిళనాడు వైపే ఉంది. పార్టీల గెలుపోటములపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. వేలకోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. TVK పార్టీ అధినేత విజయ్ క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపారు. మహాబలిపురం దగ్గర రిసార్ట్‌లు బుక్‌ చేశారు. గెలిచిన అభ్యర్థులు రిసార్ట్‌కు రావాలని విజయ్ ఆదేశించారు.

కేరళ సీఎం విజయన్ సోషల్‌మీడియా ప్రొఫైల్‌ మార్చారు. ప్రొఫైల్‌లో సీఎం అనే పదం తొలగించారు. CM స్థానంలో CPI(M) పొలిట్ బ్యూరో సభ్యుడిగా మార్చారు.

ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కర్నాటక, మహారాష్ట్ర, నాగాలాండ్‌, త్రిపుర, గుజరాత్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత భారీగా ఏర్పాటు చేశారు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *