మృత్యువుతో ముగిసిన సెల్ఫీ సరదా.. నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలి!

మృత్యువుతో ముగిసిన సెల్ఫీ సరదా.. నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలి!


ఉత్తరప్రదేశ్‌లో ఒక శుభకార్యం పెను విషాదాన్ని మిగిల్చింది. బల్లియా జిల్లాలో పుట్టువెంట్రుకలు తీయించే వేడుక కోసం గంగానది తీరానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫీ మోజులో లోతైన నీటిలోకి వెళ్లడం ఈ ఘోర ప్రమాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఫేఫానా పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణిపూర్ గ్రామానికి చెందిన వశిష్ఠ చౌహాన్ కుటుంబంలో ఆదివారం (మే 03) పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుక నిమిత్తం బంధుమిత్రులతో కలిసి అందరూ బల్లియా నగరంలోని శివరాంపూర్ ఘాట్‌కు చేరుకున్నారు. ఒకవైపు వేడుకలు జరుగుతుండగా, యువత ఉత్సాహంగా గంగానదిలో స్నానానికి దిగారు.

నదిలో స్నానం చేస్తూ ఆ ఫోటోలను మొబైల్‌లో బంధించే క్రమంలో, కొంతమంది యువతులు సెల్ఫీలు తీసుకుంటూ నీటి లోతును గమనించకుండా ముందుకు వెళ్లారు. అకస్మాత్తుగా వారు ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో, వారిని రక్షించేందుకు అక్కడే ఉన్న ఇద్దరు యువకులు ప్రయత్నించారు. అయితే, నది ప్రవాహం బలంగా ఉండటంతో నలుగురూ నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు ఇద్దరిని ప్రాణాలతో రక్షించగలిగారు, కానీ మిగిలిన వారు గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మంగళా ప్రసాద్ సింగ్, పోలీసులు, అధికార యంత్రాంగం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మత్స్యకారులు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను హర్షిత చౌహాన్ (17), నందిత చౌహాన్ (12), అరుణ్ చౌహాన్ (20), అర్జున్ చౌహాన్ (19) గా గుర్తించారు. వీరిలో హర్షిత, నందిత స్వయానా అక్కాచెల్లెళ్లు. ఆనందంగా సాగాల్సిన వేడుకలో ఒక్కసారిగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో వశిష్ఠ చౌహాన్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కళ్యాణిపూర్ గ్రామంలో మరియు శివరాంపూర్ ఘాట్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *