Rain Alert: రైతన్నలు జర భద్రం.. వచ్చే 3 రోజులు గాలి వానల బీభత్సం.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..

Rain Alert: రైతన్నలు జర భద్రం.. వచ్చే 3 రోజులు గాలి వానల బీభత్సం.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..


సముద్ర తీరంలో ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పస్టం చేసింది.

ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురువనుండగా.. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అదే సమయంలో రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి మూడు రోజుల్లో క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచింది. వరి పంటలు కోసే సమయం కావడంతో రైతులు ధాన్యం తడవకుండా తగు జాత్రలు తీసుకోవాలని కోరింది.

ఇక అటు ఏపీలోనూ రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *