Dacoit OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి అడివి శేష్ రీసెంట్ సూపర్ హిట్.. ‘డెకాయిట్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Dacoit OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి అడివి శేష్ రీసెంట్ సూపర్ హిట్.. ‘డెకాయిట్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘డెకాయిట్’.. ఏ లవ్ స్టోరీ అనేది ఈ మూవీ క్యాప్షన్. షానీల్ డియో తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఏప్రిల్ 10న రిలీజైన డెకాయిట్ సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజే రూ. 15 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. అలాగే కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఓవరాల్ గా డెకాయిట్ సినిమా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అడివి శేష్ నటన, మృణాల్ గ్లామర్, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డెకాయిట్ సక్సెస్ కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. డెకాయిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు భారీగానే చెల్లించినట్లు సమాచారం.

తాజాగా డెకాయిట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ డెకాయిట్ స్ట్రీమింగ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌  సంయుక్తంగా డెకాయిట్ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో విలన్ గా నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్, జరీనా వాహబ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. ముఖ్యంగా చిచ్చు బుడ్డి సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరి థియేటర్లలో డెకాయిట్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మరోసారి ఈ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీని చూడాలనుకుంటున్నారా? అయితే కొద్ది రోజులు ఆగండి ఎంచెక్కా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *