సాధారణంగా ఓటీటీలో విభిన్న కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. భాషతో సంబంధం లేకపోయినా కొత్త కొత్త సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన వాలా 2 చిత్రం తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న మలయాళ డార్క్ కామెడీ చిత్రం ‘భరతనాట్యం-2 మోహినియాట్టం ’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
యువ నటుడు సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ కామెడీగా తెరకెక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 8 నుంచి ఈ చిత్రం ఓటీటీ అడియన్స్ ముందుకు రానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఓటీటీలో మెప్పించనుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఊహించని సమస్యలు, వాటి నుండి బయటపడటానికి వారు చేసే ప్రయత్నాలను దర్శకుడు కృష్ణదాస్ మురళి ఎంతో హాస్యభరితంగా ఈ చిత్రంలో చూపించారు.
ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..
ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.21.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన రహస్యాల చుట్టూ తిరుగుతుంది. కుటుంబం ప్రతిష్టను కాపాడటానికి కథానాయకుడు పడే పాట్లు, ఆ క్రమంలో చోటుచేసుకునే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. సాయిజు కురుప్ తన సహజసిద్ధమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..