మట్టి మిశ్రమం – తేమను పట్టి ఉంచేలా: మట్టి గట్టిగా ఉంటే పుదీనా వేర్లు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేవు. సాధారణ మట్టిని 50శాతం, వర్మీకంపోస్ట్ లేదా పశువుల ఎరువును 30శాతం, ఇసుకను 20శాతం కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. ఇసుక కలపడం వల్ల నీరు నిల్వ ఉండదు, అదే సమయంలో వర్మీకంపోస్ట్ తేమను పట్టి ఉంచుతుంది. వేసవిలో పుదీనాకు తేమ చాలా అవసరం. కానీ ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేళల్లో తేలికపాటి నీటిని చల్లండి.