Roja : అప్పుడు సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. తనని చూస్తే గర్వంగా ఉంది.. రోజా

Roja : అప్పుడు సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. తనని చూస్తే గర్వంగా ఉంది.. రోజా


టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రోజా. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తున్న ఆమె.. అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన సవాళ్లు, సినీ పరిశ్రమలోని ప్రముఖులతో తన అనుబంధాలు, ప్రస్తుత తరం నటులపై ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు. తొలి సినిమా ప్రేమతపస్సు ఫ్లాప్ అయినప్పుడు, లేదా తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గకుండా పోరాడానని రోజా తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో గెలిచినా, ఓడినా స్వీకరించాలనే ధ్యేయంతో ముందుకు సాగానన్నారు. రాజకీయాల్లో తాను పేద ఆర్టిస్ట్ అని తన భర్త సరదాగా వ్యాఖ్యానించేవారని, కొందరు తన ఎదుటే నటిస్తుంటే అది తనకు ఆశ్చర్యం కలిగించేదని పేర్కొన్నారు. రాజకీయాలు, సినీ పరిశ్రమ మధ్య సంబంధాలపై చర్చలు ఉన్నప్పటికీ, తనకు ఆఫర్లు రాకపోవడానికి తన బిజీ షెడ్యూలే కారణమని, టీవీ షోలకు మాత్రమే సమయం కేటాయించగలుగుతున్నానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

బాలకృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన చాలా సరదాగా, అభిమానంగా ఉండేవారని తెలిపారు. “భైరవ ద్వీపం” చిత్రం కోసం క్వీన్ గెటప్‌లో తన అందాన్ని బాలకృష్ణ ఎంతో మెచ్చుకున్నారని చెప్పారు. అదేవిధంగా, “అన్నమయ్య” లో మోహన్ బాబు పక్కన క్వీన్ పాత్రలో నటించానని తెలిపారు. వెంకటేష్ ను తాను మంత్రి అయిన తర్వాత కలిసినప్పుడు “నువ్వు దీనికి అర్హురాలివి, చాలా కష్టపడ్డావు” అని అభినందించారని పేర్కొన్నారు. నాగార్జున అంటే హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టమని, ఆయన ఎవరినీ బాధపెట్టకుండా గౌరవంగా ఉంటారని, ఎంతో కూల్ గా వ్యవహరిస్తారని రోజా వెల్లడించారు. చిరంజీవితో తన మొదటి సినిమా “ముఠా మేస్త్రి”లో డ్యాన్స్‌తోనే తొలి షాట్ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. మొదట భయపడినా, చిరంజీవి తనకు సమయం ఇచ్చి నేర్చుకోవడానికి సహకరించారని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ప్రస్తుత తరం హీరోలపై రోజా ఆసక్తికరమైన అభిప్రాయాలు పంచుకున్నారు. మహేష్ బాబు తన అభిమాన నటుడని, ఆయన తల్లిగా నటించడానికి తాను సిద్ధంగా లేనని, కానీ వదిన లేదా అక్క పాత్ర అయితే నటిస్తానని సరదాగా చెప్పారు. ప్రభాస్ వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టమని, ఆయనను అందరూ డార్లింగ్ అని పిలవడం బాగుంటుందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లోని గ్రేస్, అల్లు అర్జున్ గంగోత్రి నుండి స్టైల్ ఐకాన్ గా మారిన తీరు పై ప్రశంసలు కురిపించారు. అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. “ముఠా మేస్త్రి” షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊటీలో చాలా అల్లరి పిల్లాడని, కానీ స్కూల్లో చేరాక సైలెంట్ అయిపోయాడని రోజా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సెట్ లో తనను ఎత్తుకుని ఆడించేదాన్నినని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి ఎంతో గర్వపడ్డానని, అతని డ్యాన్స్‌లో తండ్రి చిరంజీవి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

Roja, Ram Charan

Roja, Ram Charan

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *