పై ఫొటోను గమనించారా? ఈ గ్యాంగ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో ఉన్నాడు. పలు ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హీరో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాదు సహాయక నటుడిగానూ మెప్పించాడు. మరికొన్ని సినిమాల్లో విలన్ గానూ ఆకట్టుకున్నాడు. వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు. కేవలం తెలుగులోనూ కాదు తమిళ భాషలోనూ సినిమాలు చేసి అక్కడి ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. అయితే కొన్ని రోజుల క్రితం అనూహ్యంగా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడీ ట్యాలెంటెడ్ హీరో. రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో కొన్ని రోజులు పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా అనుభవించాడు. అయితే ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ హీరో సైలెంట్ అయిపోయాడు. సినిమాల్లో నటించడం లేదు. బయట కూడా ఎక్కడ కనిపించడం లేదు. మరి ఇంతకీ పై ఫొటోలో ఉన్న హీరోను గుర్తు పట్టారా? ఫొటోలో ఎడమ వైపు చివరన ఉన్న కుర్రాడిని చూస్తే చాలా మంది ఆ హీరోను గుర్తు పట్టవచ్చు. అతను మరెవరో కాదు ఒకరికి ఒకరు సినిమా హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.
ఇవి కూడా చదవండి
రోజాపూలు సినిమాతో మొదటి సారిగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు శ్రీరామ్. ఆతర్వాత ఒకరికి ఒకరు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, సుప్రీమ్, లై, శ్రీనివాస కళ్యాణం, సీత, రాగల 24 గంటల్లో, నమస్తే నేస్తమా తదితర చిత్రాల్లో హీరోగా, సహాయక నటుడిా మెప్పించాడు. తమిళంలో విజయ్ దళపతి హీరోగా నటించిన స్నేహితులు (త్రీ ఇడియట్స్) సినిమాలో శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే పిండం, హరికథ వెబ్ సిరీసులతో ఓటీటీ ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడీ హీరో. అయితే కొన్ని నెలల క్రితం డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు శ్రీకాంత్. దీంతో ఇతని పేరు ఇండస్ట్రీలో బాగా మార్మోగిపోయింది.
భార్య వందనతో శ్రీకాంత్..
సినిమాల సంగతి పక్కన పెడితే.. శ్రీకాంత్ 2008లో వందన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె అహానా.. కుమారుడు ఆహిల్ ఉన్నారు. వందన కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. భర్తతో కలిసి ‘గోల్డెన్ ఫ్రైడే ఫిల్మ్స్’ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేసింది వందన. ‘నంబియార్’ అనే సినిమాను కూడా నిర్మించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.