Headlines

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. ఇంటి వద్ద నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. ఇంటి వద్ద నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?


మీరు పీఎఫ్ అకౌంట్‌ను మూడేళ్ల పాటు వాడకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ చేస్తుంది. మూడేళ్ల పాటు మీ అకౌంట్‌లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా, క్లెయిమ్స్ కోసం రిక్వెస్ట్‌లు పెట్టకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇలాంటి సమయంలో మీ అకౌంట్లోని డబ్బు తీసుకోవాలన్నా సాధ్యం పడదు. తిరిగి అకౌంట్‌ను యాక్టివ్ చేసుకుంటేనే డబ్బులు తిరిగి తీసుకోవచ్చు. మీరు ఇక నుంచి ఇంటి వద్దనే మొబైల్ ద్వారా అకౌంట్‌ను తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇ-ప్రాప్తి అనే పోర్టల్‌ను కేంద్రం తీసుకొస్తుంది. త్వరలోనే దీనిని తీసుకురానున్నట్లు ఇటీవల కేంద్ర ఉపాధి, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పాత అకౌంట్లలో నిలిచిపోయిన డబ్బులను తిరిగి పొందటంలో ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది ఖాతాదారులకు ఇది ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.

ఇంటి వద్ద నుంచే యాక్టివేట్

ఆధార్ ద్వారా ఖాతాదారులు పాత పీఎఫ్ అకౌంట్లను గుర్తించవచ్చు. అలాగే వాటిల్లో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచే అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు పాత పీఎఫ్ అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలన్నా లేదా అమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలన్నా పాత యజమాని నుంచి ఆమోదం పొందాల్సి వచ్చేది. అలాగే పేపర్ వర్క్ కూడా చాలా ఉండేది. పాత కంపెనీలు మూతపడటం, మద్దతు ఇవ్వడంలో నిరాకరించడం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా రానున్న ఇ-ప్రాప్తి వెబ్‌సైట్ యాజమాన్యాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగులు తమ ఆధార్ ఉపయోగించి నేరుగా పాత పీఎఫ్ అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

కొత్త పోర్టల్ ప్రయోజనాలు

-కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది

-ఆధార్ ఆధారిత అత్యాధునిక డిజిటల్ వ్యవస్థపై ఇది పనిచేస్తుంది

-ఎలాంటి మధ్యవర్తి, కంపెనీ ప్రమేయం లేకుండా ఖాతాదారులు సేవలు పొందవచ్చు

-తొలుత మెంబర్ ఐడీ ఆధారంగా ఇ-ప్రాప్తి పోర్టల్ పనిచేస్తుంది. మెంబర్ ఐడీ కలిగి ఉన్నవారు ఈ వెబ్ సైట్ ద్వారా పాత పీఎఫ్ అకౌంట్‌ను గర్తించి యాక్టివేట్ చేసుకోవచ్చు

-మెంబర్ ఐడీ లేకపోయినా పాత అకౌంట్‌ను కనుగొనేలా ఆ తర్వాత వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయనున్నారు

-83.1 మిలియన్ మంది గత ఆర్ధిక సంవత్సరంలో క్లెయిమ్స్ పెట్టుకున్నారు

-ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో క్లెయిమ్స్ జరిగాయి

-చెక్ కాపీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

-క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక మూడు రోజుల్లో అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి

-ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఈపీఎఫ్‌వో ప్రవేశపెట్టింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *