నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!


నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సాధారణంగా ఈ విశ్వంలో జీవించే అన్ని జీవులు నోటి ద్వారానే ఆహారం తీసుకుంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ కప్పలు మాత్రం అన్ని జీవులకు బిన్నంగా తమ ఆహారాన్ని తీసుకుంటాయట. అవును వీటికి మనుషులు, ఇతర జీవుల్లా ఆహారాన్ని నమిలేందుకు పళ్లు ఉండవట. అందువల్ల, ఈ కప్పులు తాము పట్టుకున్న కీటకాలను లేదా చిన్నపాటి జీవులను నమలకుండానే నేరుగా మింగేస్తాయట. అయితే ఇక్కడ కూడా కప్పలు ఓ వితం పద్దతిని ఉపయోగిస్తాయట.

అవి తీసుకున్న ఆహారం సులభంగా గొంతులోకి వెళ్లడానికి కప్పలు ఆహారాన్ని మింగేటప్పుడు తమ కనుగుడ్లను లోపలికి నెడతాయట.. అంటే ఇవి నోటి ద్వారా కాకుండా కళ్ల కింద నుంచి ఇవి ఆహారాన్ని తీసుకుంటాయట. వీటి కళ్ల కింద ఉండే ప్రత్యేక కండరాలు, కనుగుడ్లను లోపలికి గుంజడం ద్వారా ఆహారాన్ని గొంతులోకి నెట్టడంలో సహాయపడతాయట. వీటి తల పైభాగంలో కళ్ల మధ్య ఉండే భాగం ఎముకలతో కాకుండా, సాగే గుణం గల మెత్తటి కణజాలంతో నిర్మితమై ఉంటుందట. ఈ ప్రత్యేక నిర్మాణం వల్లే కనుగుడ్లు కిందికి దిగి, ఆహారాన్ని లోపలికి పంపడానికి వీలు కలుగుతుంది.

అయితే కప్పల నాలుక నోటి ముందు భాగానికి అతుక్కొని ఉంటుందట. ఇది దూరంగా ఉన్న కీటకాలను సైతం మెరుపు వేగంతో పట్టుకోవడానికి, వాటిని వేటాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందట. అయితే, ఎరను పట్టుకోవడంలో నాలుక కీలకం అయితే, దానిని గొంతులోకి పంపించడంలో మాత్రం కనుగుడ్ల కండరాలే ముఖ్య పాత్ర పోషిస్తాయట. ఇలా తన శరీర నిర్మాణాన్ని బట్టి ఆహారాన్ని స్వీకరించే కప్పల జీవనశైలి ప్రకృతిలోని అద్భుతాలలో ఒకటి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *