పవన్ కల్యాణ్ ఎందుకు సీఎం కాకూడదు.. టీవీ9 ఇంటర్వ్యూలో పి.వి. సునీల్ కీలక వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఎందుకు సీఎం కాకూడదు.. టీవీ9 ఇంటర్వ్యూలో పి.వి. సునీల్ కీలక వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు, దళిత, కాపు సామాజిక వర్గాల పాత్రపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఐపీఎస్ పి.వి. సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళితుల హితం, వారి సంక్షేమమే తన ఏకైక అజెండా అని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రధాన రాజకీయ పార్టీలలో బానిసలా చేరనని, పార్టీ స్థాపన పరిస్థితులను భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు. ఏపీలో భవిష్యత్తు కాపు సీఎం తథ్యమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కాపుగా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. ప్రజారాజ్యం, జనసేన వంటి ప్రయత్నాలతో కాపు సమాజంలో చైతన్యం ఉందని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, రెడ్లు, కమ్మలు రాజ్యాధికారాన్ని అంత సులభంగా వదులుకోరని పేర్కొన్నారు.

దళితులు తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవాలని, కేవలం పార్టీలపై ఆధారపడటం మంచిది కాదని ఆయన సూచించారు. ఆకివీడు మున్సిపాలిటీ ఉదాహరణను ఉటంకిస్తూ, దళితులు తమకు తామే చూసుకోవాలని, పొలిటికల్ స్లేవరీ మంచిది కాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ప్రస్తావించారు. తాను వైఎస్ఆర్సీపీలో కానీ, టీడీపీలో కానీ చేరబోనని పి.వి. సునీల్ కుమార్ నిస్సందేహంగా చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *