మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ హాట్ సీట్‌లో కూర్చుంటే.. ప్రశ్నలతో అగ్గి రాజేసింది టీవీ9 క్రాస్ ఫైర్. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఎదురెదురుగా నిలిచి అడిగిన పదునైన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మతపరమైన ఆరోపణల నుంచి రాజకీయ నిర్ణయాల వరకు.. ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు సంధించారు. ఈ క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఇంటర్వ్యూ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.