Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ ఎక్స్‏ప్రెషన్స్ బాలేదన్నారు.. అయినా తనే కావాలన్నాను.. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్.. డైరెక్టర్ విజయ్ భాస్కర్..

Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ ఎక్స్‏ప్రెషన్స్ బాలేదన్నారు.. అయినా తనే కావాలన్నాను.. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్.. డైరెక్టర్ విజయ్ భాస్కర్..


దర్శకుడు విజయ్ భాస్కర్ తెలుగులో అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను తెరకెక్కించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్ర నిర్మాణంలో ఎదురైన సవాళ్లను, ఆర్తి అగర్వాల్ ఎంపిక వెనుక ఉన్న కథను ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ చిత్రంలో హీరో పాత్ర ప్రేమలో ఉన్నప్పటికీ, స్నేహానికి, బాధ్యతకు విలువనిస్తూ తన ప్రేమను వ్యక్తపరచలేకపోవడం చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయిన స్థితిలో హీరో తన ప్రేమను వ్యక్తపరిస్తే అది దుర్వినియోగంగా మారే ప్రమాదం ఉందని, ఈ డైలమానే సినిమాకు మరింత బలం చేకూర్చిందని తెలిపారు. గుడి వద్ద హీరోయిన్ తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశం, క్యారెక్టరైజేషన్ పాడుచేయకుండా కథనాన్ని ముందుకు నడిపించిందని ఆయన వివరించారు. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, ఈ సినిమాలో భావోద్వేగాల సంక్లిష్టత ఉందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

అలాగే ఆర్తి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడంలో ఎదురైన అడ్డంకుల గురించి విజయ్ భాస్కర్ పంచుకున్నారు. ఉషాకిరణ్ వారి రామోజీరావు హిందీ సినిమా కోసం ముంబై వెళ్ళినప్పుడు, ఒక హిందీ సినిమా షూటింగ్ లో ఆర్తి అగర్వాల్‌ను చూశానని తెలిపారు. వెంటనే ఆమెను నువ్వు నాకు నచ్చావ్ కోసం ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆమె అప్పటికే అమెరికా వెళ్లిపోయారని పేర్కొన్నారు. అప్పుడు రవి కిషోర్, సురేష్ వంటి వారితో మాట్లాడి, అమెరికాలోని తన స్నేహితుడి ద్వారా ఆర్తి అగర్వాల్ నడుస్తున్న, మాట్లాడుతున్న వీడియో క్యాసెట్‌ను తెప్పించామని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

సురేష్ బాబు వంటి సినీ ప్రముఖులు ఆర్తి అగర్వాల్ ఎక్స్‏ప్రెషన్స్ అంతగా ఇవ్వడం లేదని అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. అయినా తనకు ఆమెపై పూర్తి నమ్మకం ఉందని విజయ్ భాస్కర్ తెలిపారు. కొత్త నటీనటులను తమకు కావాల్సిన విధంగా మలచుకోవచ్చునని, వారికి స్క్రిప్ట్ ప్రకారం పాత్రను సరిదిద్దవచ్చని అన్నారు.. నిర్మాతలు తన నిర్ణయంపై నమ్మకంతో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. మొదటి సినిమాలో ఆర్తి అగర్వాల్ కష్టపడి పనిచేసిందని, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఎంతటివారైనా విజయం సాధిస్తారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *